ఉద్యోగులకు గుడ్‌న్యూస్ కొత్త పీఎఫ్ రూల్.. ఏప్రిల్ 1 నుండి అమలు!

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 01:29 PM

ఉద్యోగులకు గుడ్‌న్యూస్ కొత్త పీఎఫ్  రూల్.. ఏప్రిల్ 1 నుండి  అమలు!

సాధారణంగా ప్రతి ఒకరు తాను చేసే ఉద్యోగానికి వచ్చే జీతంలో కొంత బాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకుంటారు . అలాంటి వారి ప్రతి ఒకరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంట్లో మీ వేతనం నుంచి ప్రతి నెలాఎంతో కొంత మొత్తం దీంట్లో జమవుతుంది.అంతేకాకుండా సంస్థ కూడా యాడ్ చేస్తుంటుంది.అయితే పీఎఫ్ చందాదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఒక శుభవార్త అందింది. ఉద్యోగం మారిన సమయంలో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా కొత్త నిబంధన తీసుకొస్తోంది


ఈ రోజుల్లో చాలా మంది తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. అలాంటి వారు ముఖ్యంగా వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్‌కు సంబంధించి ఇబ్బందులు పడుతుంటారు. దీనిని కొత్త సంస్థకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు . అందులో ఉన్న డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి , వడ్డీ సంగతేంటి ఇలా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారి కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

కొత్త రూల్ అందుబాటులోకి వస్తే కనుక ఇక ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు మాన్యువల్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సంస్థలో జమ అయి ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆటో కొత్త సంస్థ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుందన్నమాట. దీంతో పీఎఫ్ చందాదారులకు తమ అకౌంట్‌కు సంబంధించి ఉన్న సందేహాలను ఇది తొలగిస్తుందని చెప్పొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే చాలా వరకు పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల ఇబ్బందులు తగ్గుతాయి.

ఇది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా దీనిపై పూర్తి మార్గదర్శకాలు బయటికి రాలేదు. అధికారికంగా ఈపీఎఫ్ఓ దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుందా.. అకౌంట్ విలీనం అవుతుందా అనే విషయాలు ఇంకా తెలియంసింది ఉంది . ఇంకా వడ్డీ ఎలా యాడ్ అవుతుంది.. ఇలాంటి అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
కొత్త కొత్త అవకాశాలు, మంచి జీతాలు ఆశిస్తూ చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఉద్యోగం మారిన చోట కచ్చితంగా కొత్త పీఎఫ్ అకౌంట్ తెరుస్తుంటారు. వాటిని విలీనం మాత్రం చేయరు. ఎలానో తెలియక కొందరు.. ఏమైనా ఇబ్బందులుంటాయోనని ఇంకొందరు.. దీని గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇందులో ప్రతిసారీ ఒకటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉంటుంది. దీనిపైనే కొత్త కొత్త పీఎఫ్ అకౌంట్లు తెరుస్తుంటారు. ఇలా సర్వీసు కాలం ఎక్కువగా ఉన్నట్లు కనిపించదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్ ఐదేళ్లు దాటితే అందులో విత్‌డ్రాలపై టాక్స్ ఉండదు. అదే విలీనం చేయకుండా రెండు, మూడేళ్లకు సంస్థ మారితే.. ఈ ప్రయోజనం కోల్పోవచ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్‌ను అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రిటైర్మెంట్ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత కూడా ఇతర మెడికల్ ఎమర్జెన్సీ, వివాహం, ఇల్లు రెనోవేషన్ ఇలా పలు అవసరాలకు డబ్బులు తీసుకోవచ్చు. పీఎఫ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.ఇలాంటి విషయాలు తేలియక చాల మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు . ఒకవేళ ఈ కొత్త పి ఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విషయము అమలులోకి వస్తే చిటికి మాటికీ జాబ్స్ మారె వారికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు .






Untitled Document
Advertisements