అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే ఈ ఉగాదికి దేవర మూవీ రిలీజ్ అయ్యుండేది

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 03:42 PM

అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే ఈ ఉగాదికి  దేవర మూవీ రిలీజ్ అయ్యుండేది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అనే విషయము అందరికి తెలిసిందే . అయితే ఈ నెల చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందనే టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న వార్ 2 షూటింగ్ లో తారక్ జాయిన్ కావాల్సి ఉంది. తారక్ డేట్స్ కోసం వార్ 2 మూవీ టీమ్ వెయిట్ చేస్తోంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే ఏప్రిల్ 5న ఉగాదికి దేవర మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఉండేది.

కానీ చివరికి షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా అక్టోబర్ కి వాయిదా పడిపోయింది. తారక్ సోలోగా నటించిన చివరి చిత్రం అరవింద సమేత.ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా హిట్ అయినంది . తరువాత ఆర్ఆర్ఆర్ కి డేట్స్ ఇచ్చేయడంతో మూడేళ్లు కంప్లీట్ గా ఆ సినిమాతోనే తారక్ ప్రయాణం సాగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేయలేదు. కొరటాల కోసం ఏడాది సమయం వెయిట్ చేశారు.

గత ఏడాది దేవర సినిమా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళింది. ఇప్పటికి షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో సోలోగా తారక్ థియేటర్స్ లోకి వచ్చి ఐదేళ్లు అవుతోంది. తారక్ కెరియర్ లో ఇన్నేళ్ల గ్యాప్ ఎప్పుడూ రాలేదు. అరవింద సమేత మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. సీడెడ్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ అరవింద సమేత పేరు మీదనే ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. తారక్ నుంచి రాబోయే మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఏవో కారణాలతో ప్రస్తుతం చేస్తోన్న మూవీ వెనక్కి వెళ్తూనే ఉంది. దేవర తర్వాత అయిన టైం గ్యాప్ లేకుండా ప్రభాస్ తరహాలో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ చేసుకోవాలని తారక్ అభిమానులు రిక్వస్ట్ చేస్తున్నారు.

కాని దేవర తర్వాత తారక్ చేయబోయే వార్ 2 మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ పెరిగిన సోలో మూవీ అనిపించుకోదు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. వచ్చే ఏడాది అంటున్న కన్ఫర్మేషన్ అయితే లేదని చెప్పాలి. దాని తర్వాత యష్ రాజ్ లో సోలోగా ఓ స్పై థ్రిల్లర్ మూవీ తారక్ చేయనున్నాడు. ఈ మధ్యలో దేవర పార్ట్ 2 కూడా ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయన సినిమాలు ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని ఎదురు చూస్తుంటారు .





Untitled Document
Advertisements