లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు రెడీ అంటున్న రష్మిక

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 04:34 PM

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు రెడీ అంటున్న రష్మిక

తెలుగులో తీసిన పుష్ప మరియు యానిమల్ సినిమాలతో మంచి పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న హీరియిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో ధనుష్ కి జోడీగా మరోక సినిమా లో, హిందీలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది అనే విషయాలు బయటకి వచ్చాయి .

ఇంత బిజీగా ఉన్న రష్మిక మందన్న కొన్నాళ్లుగా వర్కౌట్స్ మానేశాను మళ్లీ మొదలు పెట్టాను అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రష్మిక మందన్న రెండు మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్టులు పెట్టే రష్మిక తాజాగా ఆసక్తికర పోస్ట్‌ షేర్ చేసింది. ఇందులో తన పెట్‌ డాగ్ ను బెడ్‌ పై పడుకోబెట్టుకుని సోషల్‌ మీడియాలో ఆ ఫోటోను షేర్‌ చేసింది. నా ఉదయం ఈమెతో చాలా బెస్ట్‌ గా మారుతుంది అంటూ ఈ ఫోటోకు రష్మిక మందన్న లవ్‌ ఈమోజీని షేర్‌ చేసి మరీ కామెంట్ చేసింది. అందమైన ఈ ఫోటో కి నెటిజన్స్ క్యూట్‌ గా ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఒక పెట్‌ డాగ్‌ పై ఇంత అభిమానం, ప్రేమ ఏంటి అమ్మడు అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఒక పెట్‌ ను ప్రేమించిన సెలబ్రిటీని మేము చూడలేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి రష్మిక తన పెట్‌ లవ్‌ ను ఇలా చూపించి అందరిని ఆశ్చర్య పరిచింది. రష్మిక మందన్న బాలీవుడ్‌ లో చేసిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా యానిమల్‌ సినిమాతో స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో కచ్చితంగా ముందు ముందు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తుందో, అని ప్రేక్షకులు అనుకుంటున్నారు . ఇప్పుడు నటించే పుష్ప 2 మరింత తన ఇమేజి ని పెంచేటట్లుగా ఉంది అని అర్థం అవుతుంది .






Untitled Document
Advertisements