మహానటి, మెగాస్టార్ ఓకే వేదికపైన 'కాఫీ టేబుల్ బుక్‌' ఆవిష్కరణ

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 01:06 PM

మహానటి, మెగాస్టార్ ఓకే వేదికపైన 'కాఫీ టేబుల్ బుక్‌' ఆవిష్కరణ

పాత కాలంలో మహానటి అంటే సావిత్రి గారు అని చెప్పుకోవాలి. మరి నేటి తరంలో సావిత్రి అంటే చాలు అందరికి గుర్తుకు వచ్చేది కీర్తి సురేష్ పేరు. అలనాటి సావిత్రిని చూడని వారు ఈ సావిత్రిని చూసి సంతోషపడుతున్నారు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప న‌టి జీవితంలో న‌టించే అరుదైన అవ‌కాశం కీర్తి సురేష్ ద‌క్క‌డం అన్న‌ది ఆమె పూర్వ‌జ‌న్మసుకృత‌మనే చెప్పాలి. ఎంతో మంది న‌టీమ‌ణులున్నా నాగ్ అశ్విన్ ఆమెలో మ‌హాన‌టిని చూడంతోనే అది సాద్య‌మైంది.
ఇక ఆ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే అందరికి. తాజాగా ఆ మహాన‌టి జ్ఞాప‌కాలు మ‌రోసారి నెమ‌ర వేసుకునే అవకాశం వ‌చ్చింది. సావిత్రీ జీవితానికి సంబంధించిన విశేషాలు ఫోట‌ల‌తో ఓ ప్రత్యేక 'కాఫీ టేబుల్ బుక్‌' ని సావిత్రి కుమార్తె చాముండేశ్వ‌రి విడుద‌ల చేస్తున్నారు. విజయ చాముండేశ్వరి కి సైతం తెలియ‌ని ఎన్నో ఛాయా చిత్రాలను ఇందులో పొందుప‌రిచిన‌ట్లు తెలుస్తోంది. ఈ పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈరోజు సాయంత్రం లాంచ్ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. అలాంటి కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆ పుస్త‌కాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. చిరుతో పాటు ఈ కార్య‌క్ర‌మంలో కీర్తి సురేష్ కూడా భాగ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. మ‌హాన‌టి బ‌యోపిక్ లో ఆమె న‌టించింది. కాబ‌ట్టి ఆ హోదాలో కీర్తి హాజ‌ర‌వుతుంద‌ని ఆమెకి కూడా ప్ర‌త్యేక ఆహ్వానం కుటుంబ స‌భ్యుల నుంచి వెళ్లే ఉంటుంద‌ని గెస్ చేస్తున్నారు. కీర్తి కూడా అటెండ్ అయితే ఆవేదిక మ‌రింత శోభతో నిండిపోతుంది. చిరు-కీర్తి ఒకే వేదిక‌పై ఉంటే ఆ కార్య‌క్ర‌మం ఎంత స‌ర‌దాగా సంతోషంగా జ‌రుగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో మెగాస్టార్ కిర్తి ఇద్ద‌రు 'భోళా శంక‌ర్' చిత్రంలో అన్నా- చెల్లిగా క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు సావిత్రి బ‌యోపిక్ చూసి కీర్తి న‌ట‌న‌పై చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె న‌టించిన తీరుపై చిరంజీవి ఎంతో స‌ర్ ప్రైజ్ అయిన‌ట్లు చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు నెమ‌ర వేసుకునే అవ‌కాశం ఈరోజు దొరికింది. ఇంకా ఈ కార్య‌క్ర‌మానికి ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన వారు అందరు కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం లేక పోలేదు . అలాంటి గొప్ప నటి జీవిత చరిత్ర ని బుక్ రూపములో విడుదల చేయడం చాల గొప్ప విషయం.






Untitled Document
Advertisements