కొత్త సినిమాకు చిన్న పాటి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 01:29 PM

కొత్త సినిమాకు చిన్న పాటి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు

ప్రస్తుతం ఉన్న ఎండాకాలం వేడికి స్టార్స్ అంతా తట్టుకోలేక వెకేషన్ మోడ్ లో వెళ్లిపోయారు . ఇలా తమ సినిమాలకు చిన్న పాటి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ ఒకరు . ఈయన ఎప్పుడు సినిమాలను, ఫ్యామిలీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటారు. సినిమా పూర్తి చేసిన వెంటనే ఫ్యామిలీతో ఒక లాంగ్ ట్రిప్ వేస్తారు. అంతేకాదు షూటింగ్ కి ఏదైనా గ్యాప్ వచ్చినా సరే షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడిపేందుకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు .

ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ లోని సెయింట్ మోర్టిజ్ అనే లగ్జరియస్ రిసార్ట్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి వాలిడ్ టైం స్పెండ్ చేస్తున్నారు. అది పూర్తి చేసుకుని రాగానే జూన్, జూలై లో రాజమౌళి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటో మూమెంట్స్ ని సూపర్ స్టార్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.

ఇక మరోపక్క రాం చరణ్ కూడా ఒక షార్ట్ ట్రిప్ వేశారు.తన సతీమణి ఉపాసన , కూతురు క్లిన్ కారాతో రాం చరణ్ బ్యాంకాక్ ట్రిప్ కి వెళ్లారు. థాయిలాండ్ లో ఫ్రెండ్స్ గ్యాగ్ తో రాం చరణ్ ఉపాసన దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వైరల్ గా మారాయి. ఆ ట్రిప్ ముగించుకుని రాగానే గేమ్ చేంజర్ మిగిలిన పార్ట్ పూర్తి చేసేలా చరణ్ ప్లానింగ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా ఈమధ్యనే దుబాయ్ లో తన మైనపు బొమ్మ ఇనాగరేషన్ ని పూర్తి చేసుకుని వచ్చాడు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రభాస్ కల్కి ని పూర్తి చేసే దాకా నో వెకేషన్ అంటున్నాడు. ఈ విధంగా కొంత మంది స్టార్ హీరోలు తమకు ఉన్న షెడ్యూలులో బిజీగా
ఉన్నారు . మరి కొంత మంది వెకేషన్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది .





Untitled Document
Advertisements