మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 02:44 PM

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ

మెగా ఫ్యామిలీకి చెందిన వారిలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) ఒకడు ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో తో భారీ హిట్ కొట్టారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈయన ఇప్పటి వరకు ఒక్క చిత్రాన్ని కూడా విడుదల చేయలేదు . గత ఏడాది దర్శకుడు సంపత్ నందితో కలిసి గంజా శంకర్ సినిమా ప్రకటించారు. అయితే ఆ మూవీ టైటిల్ ఇంకా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన కొందరు అధికారులు గంజా శంకర్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బడ్జెట్ సమస్య కూడా ఉన్నట్లు టాక్ వినిపించింది.

ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ మీడియా సమావేశంలో గంజా శంకర్‌ సినిమా ఉందా ఆగిపోయిందా అన్న విషయం తనకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చారు. మీరు (మీడియా) చెబితేనే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా కొన్ని వెబ్‌ సైట్లలో చూశాక ఆ విషయం తెలిసిందని, ఏదైనా మీరు చెప్తే తెలుస్తుందని పరోక్షంగా సెటైర్లు వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు . కాబట్టి ఈ మూవీని పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హనుమాన్ చిత్ర నిర్మాత కె. నిరంజన్ రెడ్డితో మెగా మేనల్లుడు సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందట. ఇక త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు టాక్. ఈ సినిమాకు గాను సాయి ధరమ్ తేజ్ కు సాలీడ్ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట నిరంజన్ రెడ్డి. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రానుంది. అయితే నిరంజన్ రెడ్డి నితిన్ తో కూడా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ మూవీని నిరంజన్ రెడ్డి రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కు హనుమాన్ సినీమా నిర్మాత. చాల రోజుల తర్వాత చేస్తున్న సినిమా కదా ఎలాంటి హిట్ కొట్టుతాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు .






Untitled Document
Advertisements