సీనియర్ నటి టబు నటించిన మరో విజయవంతమైన చిత్రం-క్రూ

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 02:54 PM

సీనియర్ నటి  టబు నటించిన మరో విజయవంతమైన చిత్రం-క్రూ

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ అవార్డు విజేత‌గా నిలిచింది సీనియ‌ర్ న‌టి ట‌బు . ఈ అమ్మడు రెండు జాతీయ అవార్డులు, ఆరు ఫిలింఫేర్ లు అందుకున్నది . దాదాపు రేండు ద‌శాబ్ధాలుగా త‌న‌దైన న‌ట‌న‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ అమ్మడు ఎంపిక చేసుకునే బలమైన స్త్రీ పాత్రలతోను ట‌బు పాపుల‌రైంది. ప్రస్తుతం ఈ వెట‌ర‌న్ బ్యూటీ 'క్రూ' ఘ‌న‌విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. ఈ చిత్రంలో తనదైన అద్భుత‌ నటప్ర‌ద‌ర్శ‌నకు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇందులో కృతి సనన్ , కరీనా కపూర్ ఖాన్‌లతో పోటీప‌డుతూ టబు డామినేష‌న్ కొన‌సాగించింది. వీళ్ల‌తో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ, శాశ్వత ఛటర్జీ, కులభూషణ్ ఖర్బందా త‌దితరులు న‌టించారు.
క్రూలో జాతీయ ఉత్త‌మ న‌టి టబులో స‌రికొత్త కోణాన్ని చూశామ‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో టబు న‌ట‌న క‌డుపుబ్బా నవ్వించింది. ఇందులో గీత అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌తి పాత్ర‌లో ట‌బు న‌టించింది . ఈ పాత్ర‌లో త‌న‌దైన అద్భుత‌ నట‌న‌కు ప్రేక్ష‌కుల‌ నుంచి మంచి స్పందన పొందుతోంది. అంధాధున్, దృశ్యం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో విజయవంతమైన చిత్రం-క్రూ. ఈ సినిమాలన్నీ టబు అద్భుత‌ నటన, మెస్మ‌రైజింగ్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసాయి.

తాజాగా రిలీజైన 'క్రూ' భారీ విజ‌యం సాధించ‌డంలో ట‌బు పాత్ర విస్మ‌రించ‌లేనిది. ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లో 62 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి సోమ‌వారం నాటికి 70 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ విజయంతో అభిమానుల్లో ట‌బు క్రేజ్ ఏ రేంజులో ఉందో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. వైవిధ్య‌మైన జాన‌ర్ల‌తో మెప్పించే ఏకైక బ్యాంక‌బుల్ నటి టబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఈ విజ‌యాల‌తో త‌దుప‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌రోసారి సీనియ‌ర్ న‌టి ట‌బుతో నాయికా ప్ర‌ధాన చిత్రాల‌ను తెర‌కెక్కించే ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు అంటే ఈ అమ్మడు తన నటనతో ఎలా కట్టి పడేసిందో తెలుస్తుంది .






Untitled Document
Advertisements