మిక్సీజార్ ను ఇలా శుభ్రం చేస్తే బ్లేడ్స్ ఎక్కువ కాలం మన్నుతాయట!

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 08:59 AM

మిక్సీజార్ ను ఇలా శుభ్రం చేస్తే బ్లేడ్స్ ఎక్కువ కాలం మన్నుతాయట!

సాధారణంగా ప్రతి ఒకరి ఇంట్లో మిక్స్ లు ఉంటున్నాయి . ఇంతకుముందు కాలంలో అంటే రోళ్ళు వాడేవారు కానీ ఇప్పుడు మిక్స్ లు , గ్రైండర్ లు ఎక్కువగా వాడుతున్నారు . వీటిని వాడినప్పుడు మిక్స్ ని , జార్ ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకోవాలి. లేదు అంటే వాటికీ మరకలు అలాగే ఉండిపోతాయి . చట్నీలు, పొడులు, మసాలాలు వంటి పదార్థాలన్నీంటిని కూడా క్షణాల్లో రెడీ చేసే ఈ మిక్సీ ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకోవాలి. అప్పుడే అవి ఎక్కువరోజులు మన్నుతాయి. అయితే, ఈ మిక్సీ జార్‌ని క్లీన్ చేయడానికి కూడా కొన్ని మార్గాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి.
కిచెన్ లభించే నిమ్మ తొక్కలతో కూడా జార్స్‌ని చక్కగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం నిమ్మతొక్కల్ని ఏదైనా లిక్విడ్, బేకింగ్ సోడాలో ముంచి లోపల రుద్దండి. దీంతో లోపల జిడ్డు కూడా ఈజీగా పోతాయి. అలానే కాసేపు ఉంచి తర్వాత నీటితో క్లీన్ చేయండి.అదే విధంగా, వీటిని క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్‌లో నీరు వేసి పేస్టులా చేయండి. దీంతో జార్స్‌ని అప్లై చేసి కాసేపు ఉంచండి. తర్వాత వీటిని నీటితో క్లీన్ చేయండి ఎప్పుడు చూడండి మెరిసిపోతాయి అంతేకాకుండా , వెనగర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. నీటిలో వైట్ వెనిగర్ కాస్తా కలపండి. జార్స్‌లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఇప్పుడు ఓ స్పాంజి తీసుకుని మొత్తం క్లీన్ చేయండి. తర్వాత నీటితో క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది.మన బట్టలకు వాడే వాషింగ్ పౌడర్‌తో కూడా జార్స్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్పాంజిని వాషింగ్ పౌడర్‌లో ముంచి జార్స్‌ లోపల రుద్దండి. వీటిని మరోసారి నీటితో క్లీన్ చేయండి.
ఈ మిక్సీ జార్స్‌ని క్లీన్ చేయడానికి లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగ పనిచేస్తుంది. ఇందుకోసం జార్స్‌లో కొద్దిగా నీరు అందులో మరికొంత లిక్విడ్ వేసి మిక్సీని ఆన్ చేయండి. కాసేపు అయిన తర్వాత ఆఫ్ చేసి ఇప్పుడు జార్స్‌ని క్లీన్ చేయండి. చక్కగా క్లీన్ అవుతాయి.ఒకవేళ మిక్సీ జార్ ని క్లీన్ చేయకుండా వదిలేస్తే తర్వాత ఏమైనా వేసుకునప్పుడు చాల బాడ్ స్మెల్ వస్తుంది . అంతేకాకుండా అవి ఎక్కువ కలం కూడా నిలువ ఉండవు . కావున మన కిచెన్ లో దొరికే వాటితోనే వీటినే మంచిగా చేసుకోవచ్చు .





Untitled Document
Advertisements