బిజీ షెడ్యుల్ లోనూ ఈ టిప్స్ పాటిస్తే ఇంటిని అద్దంలా మెరిపించొచ్చు!

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 09:29 AM

బిజీ షెడ్యుల్ లోనూ ఈ టిప్స్ పాటిస్తే ఇంటిని అద్దంలా మెరిపించొచ్చు!

ఈ మధ్య కాలంలో ఇంట్లో భార్యా భర్త ఇద్దరు జాబ్ చేస్తున్నారు అలా అయితేనే ఇల్లు గడవడం కష్టం అవుతుంది . అలాంటి సందర్భంలో మన ఇంటిని క్లీన్ గా ఉంచుకోవడం అనేది కష్టం అవుతుంది . పూర్వకాలంలో ఇల్లును చూసి ఇల్లాలును చూడండి అనే వారు .మనం రోజూ చూసే ఇల్లు నీట్‌గా లేకపోయినా ఏం అనిపించదు. కానీ, చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లు నీట్‌గా లేకపోతే అస్సలు బాగోదు. ఆ టైములో అనిపిస్తుంది ఇల్లు ఇంత చెండాలంగా ఉంది కదా వాళ్ళు చూసి ఏమి అనుకుంటారో అని భాధగా ఉంటుంది . అలాంటప్పుడు ఈజీ అండ్ క్విక్‌గా కొన్ని పనులు చేస్తే అప్పటికప్పుడు ఇల్లు అందంగా నీట్‌గా కనిపిస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువుని క్లీన్ చేయకపోయినా పరవాలేదు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు ఇల్లు అందంగా క్లీన్ అవుతుంది. మరి ఆ పనులేంటో తెలుసుకోని మీ ఇంటికి సెడాన్ గా చుట్టాలు వచ్చినప్పుడు నీట్ గా ఉంచుకొండి .


ఇంట్లో ముందుగా దుమ్ము పేరుకుపోకుండా చూడండి. కూర్చునే కుర్చీల్లో దుమ్ము త్వరగా ఫామ్ అవుతుంది. అలా కాకుండా కుర్చీలను క్లీన్ చేయండి. హాల్‌‌లో ఫ్యాన్ దుమ్ము లేకుండా క్లీన్‌గా ఉండేలా చూడండి. అదే విధంగా హాల్‌లో చాలా మంది బుక్స్, పేపర్స్ పెడుతుంటారు వీటిని తీసేయండి. కొంతమంది ఇంట్లో కిటికీలను మూసివేస్తారు. అలా కాకుండా కిటికీలను తెరిచి పెట్టండి. దీని వల్ల స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. ఇంట్లోనే అనవసరపు వాసనలు దూరమవుతాయి. ముఖ్యంగా కిచెన్‌లో కిటికీని తెరవండి. దీని వల్ల వంట తాలుకూ వాసనలు దూరమవుతాయి. ఇంట్లోకి సహజంగా కాంతి వస్తుంది. దీని వల్ల పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి, కనీసం ఓ కిటికీ అయినా తెరిచి ఉండాలి.ఆ తర్వాత డైనింగ్ టేబుల్‌ని నీట్‌గా తుడిచి దానిపై అనవసరమైన వస్తువులు క్లీన్ చేయండి. దీని వల్ల వారికి ఏమైనా వడ్డించేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు.


అంతే కాకుండా , అతిథులకి ఆతిథ్యాన్ని ఇవ్వడంలో కూడా మీ మార్క్ చూపించండి. మీరు తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. దీని వల్ల వారిపై మీకు ఉన్న ఆప్యాయత తెలియజేస్తుంది. కాబట్టి, బయటి నుంచి తెచ్చే బదులు టైమ్ తీసుకుని మీరే స్వయంగా చేసిన వంటని తినిపించండి.అదే విధంగా, భోజనం చేసేవారికి ఆహారాన్ని అందించేటప్పుడు వాటిని నీట్‌గా ఉండేలా చూసుకోండి, అంచుల్లో మురికి లేకుండా చూడండి. శుభ్రమైన గిన్నెల్లో వడ్డించండి. చాలా మంది కిచెన్‌ క్లీనింగ్‌ని బట్టి ఇంటిని అంచనా వేస్తారు. కాబట్టి, గిన్నెలు సింక్‌లో ఉండకుండా, వ్యర్థాలను పారేసి క్లీన్‌గా ఉంచండి. కంటెయినర్స్‌ని క్లీన్‌గా ఉంచుకోండి. కిచెన్‌ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిజ్‌ని కూడా క్లీన్ చేయండి. ఫ్రిడ్జ్ క్లీన్‌గా లేకపోతే అందులోని వస్తువులు తినడానికి తాగడానికి కూడా ఇష్టపడరు.అదే విధంగా ఇంటికి గెస్టు‌లు వచ్చినప్పుడు బాత్‌రూమ్ కూడా క్లీన్ చేయాలి. వాసన రాకుండా చూసుకోండి. అలాగే మురికి లేకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వచ్చిన గెస్టులు బాత్‌రూమ్‌ని చూసి వెళ్ళడానికి ఇష్టపడరు . ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను వినియోగించుకొని మన ఇంటిని చాల తొందరగా నీట్ గా , క్లీన్ గా ఉంచుకోవచ్చును . అప్పుడే ఎవరైనా వచ్చిన మీ ఇల్లును చూసి చాల బాగుంది అంటారు .







Untitled Document
Advertisements