బీరకాయ కోడిగుడ్డు కీమా కర్రీ ఒక్కసారి ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు!

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 11:02 AM

బీరకాయ కోడిగుడ్డు కీమా కర్రీ ఒక్కసారి ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు!

మన ఆరోగ్యానికి కూరగాయలు చాల మంచివి . కానీ చిన్న పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్ట పడరు . కొంత మంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు .అలాంటప్పుడు కూరగాయలలో ఒకటైనా బీరకాయ తో మరియు కోడి గుడ్డుతో కలిపి కర్రీ చేసుకోవచ్చును . అంతేకాకుండా బీరకాయ కోడి గుడ్డు కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీ, రోటీల్లోకి కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన కూరల్లో ఇది ఒకటి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా అంతా మేలే చేస్తుంది. బీరకాయ, కోడిగుడ్డు రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి వారికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ బీరకాయ కోడి గుడ్డు కీమా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం


బీరకాయ కోడి గుడ్డు పొరటు రెసిపీకి కావలసిన పదార్థాలు:

బీరకాయ తరుగు - రెండు కప్పులు
గుడ్లు - నాలుగు
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
నూనె - సరిపడినంత
అల్లం తరుగు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - అర స్పూను
ఎండు మిర్చి - రెండు
అల్లం తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి

బీరకాయ కోడి గుడ్డు పొరటు తయారీ విధానం :

ముందుగా బీరకాయను పొట్టు తీసి సన్నగా తరగాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, అల్లం తరుగు, కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారేవరకు అలానే ఉంచి బీరకాయ ముక్కలను వేయాలి.

బీరకాయల తరుగు వేశాక కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద పెడితే

పావుగంటలో ఇవన్నీ మెత్తగా ఉడికి నూనె పైకి తేలుతుంది. అలా నూనె పైకి తేలేక గుడ్లు కొట్టి ఆ కూర మీద వేయాలి.నాలుగు గుడ్లను కూరంతా పరుచుకునే ఉండేటట్టు ఉంచాలి.

కానీ వెంటనే కలపకూడదు. నాలుగు నిమిషాలు వదిలేసాక అప్పుడు అది ఆమ్లెట్‌లా అవుతుంది . అప్పుడు దాన్ని గరిటతో ముక్కలుగా చేసి కూర అంతా కోడిగుడ్డును కలిసేలా చేసుకోవాలి.

పైన మూత పెట్టి చిన్న మంట మీద మరో పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత మూత తీసి గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీరను జల్లుకుని స్టవ్ కట్టేయాలి.
అంతే టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.

బీరకాయ కోడి గుడ్డు పొరటులో ఉండే బీరకాయ, కోడిగుడ్డు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో చలువచేసే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఇది శరీరం వేడిని తగ్గించడమే కాదు, బరువు కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి దీనిలో ఉంటాయి. బీరకాయను కచ్చితంగా డైట్లో ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలి. పిల్లలకు బీరకాయని తినిపించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వారికి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.దేనిని ఒకసారి తిన్నారంటే మళ్ళి మళ్ళి తినాలి అంటారు . అంత టేస్ట్ గా ఉంటుంది .






Untitled Document
Advertisements