విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 12:47 PM

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు

విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో గీత గోవిందం సినిమా సక్సెస్ తరువాత, విజయ్ మరియు పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది అనగానే ఇండస్ట్రీలో మంచి టాక్ వచ్చింది . అందులోనూ దిల్ రాజు లాంటి ప్రొడక్షన్లో వీరి కాంబినేషన్ తెరపైకి వస్తూ ఉండడంతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విధంగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక మరోక వైపు హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ ఇందులో నటించడం మరొక మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది అనుకోవడంలో సందేహంలేదు .
చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ప్రమోషన్స్ లో చాలా ఎనర్జీతో పాజిటివ్ గా కనిపించారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెబుతూ వచ్చారు. అంతేకాక ఇందులో ఫ్యామిలీ కథ మాత్రమే కాకుండా మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. సెన్సార్ పనులను కూడా ఇటీవల ఈ సినిమా పూర్తి చేసుకుంది.

అయితే ఇలాంటి ఫ్యామిలీ కథలలో సెన్సార్ యూనిట్ నుంచి అభ్యంతరాలు చెప్పే సన్నివేశాలు ఏమీ ఉండకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఇందులో దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో బూతులు వాడినట్లు తెలుస్తోంది. ఇక సెన్సార్ వాటిపై అభ్యంతరం చెప్పడంతో ఆ బూతు డైలాగ్స్ కు మ్యూట్ చేయడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా అర్జున్ రెడ్డి లాంటి బూతు డైలాగ్ తో పాటు ఇంగ్లీషు బ్యాడ్ వర్డ్ F*** కూడా ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో వాడినట్లుగా తెలుస్తోంది. దాదాపు నాలుగు బూతు పదాలు ఉండడంతో సెన్సార్ వాటన్నిటికీ కూడా మ్యుట్ చెప్పడమే కాకుండా సబ్ టైటిల్స్ కూడా ఉండకూడదని చెప్పారు.అదేవిధంగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ లో మాత్రం లిక్కర్ కు సంబంధించి బాటిల్ ను సీజీతో బ్లర్ చేసే విధంగా సూచనలు ఇచ్చారు అనే వార్తలు వాస్తునాయి .

ఈ ఫ్యామిలీ కథలో ఇలాంటి బూతు డైలాగ్స్ ఉంటాయి అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సందర్భానుసారం కొన్ని సన్నివేశాలలో ఇలాంటి పదాలు ఉపయోగించి ఉండవచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి. కాని దిల్ రాజు సినిమాలలో అయితే అసలు ఇలాంటి పదాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వరు. మరి ఎప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాలో అంత బలమైన పదాలు ఎందుకు వాడవల్సి వచ్చింది అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. దర్శకుడు పరుశురామ్ చాలావరకు తన సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను చాలా చక్కగా హైలైట్ చేస్తాడు. రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా అందంగా ఉండేలా చూసుకుంటాడు. అంతేకాకుండా ఏవికూడా ఎబ్బెట్టుగా అనిపించేలా చేయడు. మరి ఫ్యామిలీ స్టార్ కథలో 70% వరకు లవ్ స్టోరీ తోనే నడుస్తుంది అని తెలుస్తుంది . దీనిని బట్టి ఈ సినిమా ఫ్యామిలీ కి సంబందించినదా లేదా లవ్ స్టోరీ కి సంబంధించిందా అనే విషయమ తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు .








Untitled Document
Advertisements