వరల్డ్ ఎర్త్ డేగా సందర్భంగా ఏప్రిల్ 22న ప్రియాంక చోప్రా`టైగర్`సినిమా

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 01:12 PM

వరల్డ్ ఎర్త్ డేగా  సందర్భంగా  ఏప్రిల్ 22న  ప్రియాంక చోప్రా`టైగర్`సినిమా

సినిమాలకు రాకముందు మోడల్‌గా పనిచేసిన ప్రియాంక చోప్రా 2000వసంవత్సరంలోప్రపంచసుందరికిరీటాన్నిచేజిక్కించుకుని ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత తమిళన్ అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది. తదుపరి సంవత్సరం, అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది. తర్వాత కొన్ని రోజులు అవకాశాలు లేకపోవడ వలన తిరిగి హిందీ చిత్ర‌సీమ‌లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ `టైగర్` విడుదల తేదీని ప్రకటించింది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా న‌టించ‌లేదు. ఈ అద్భుతమైన సినిమాలో ఒక పాత్ర‌కు తన వాయిస్‌ని అందించాన‌ని తెలిపింది. ఈ చిత్రం ద్వారా అడవిని అన్వేషించడం ఎలా సరదాగా ఉందో కూడా వెల్ల‌డించింది.

నిజానికి టైగ‌ర్ చిత్రం ఎనిమిదేళ్లుగా రూపొందుతోంది. ప్ర‌ఖ్యాత డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అడ‌విలో స్వేచ్ఛ‌గా తిరిగే పులి క‌థ‌తో రూపొందించిన చిత్ర‌మిది. ఈ సినిమాలో అడ‌వి అందాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ప్రేమ, సంఘర్షణ, ఆకలి, మనుగడకు సంబందించిన మరెన్నో కథల‌ను టైగ‌ర్‌లో చూడొచ్చు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను ప్రియాంక చోప్రా తాజాగా వెల్ల‌డించింది. పెద్ద- చిన్న, పిరికి - గంభీరమైన జీవులు సంచరించే భారతదేశంలోని సందడిగా ఉండే అరణ్యాలలో అంబా అనే కాలాతీత వారసత్వం కలిగిన పులి క‌థ‌ను తెర‌పై చూడొచ్చు. ఈ సినిమాలో ఆడ‌పులి తన పిల్లలను చాలా ప్రేమతో చూసుకుంటుదో , తల్లి - బిడ్డల మధ్య ఉన్న అందమైన బంధం చాలా అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ఈ అందమైన కుటుంబాన్ని తెర‌పై నేచుర‌ల్ గా చూపించాలంటే అంత సులువు కాదు. అందుకోస‌మే ఏకంగా 8 సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.

వరల్డ్ ఎర్త్ డేగా సందర్భంగా ఏప్రిల్ 22న `టైగర్` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ తేదీని వెల్ల‌డిస్తూ ప్రియాంక చోప్రా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఈ అద్భుతమైన కథకు నా వాయిస్ అందించడం చాల సంతోషంగా ఉంది . ఈ చిత్రం ద్వారా అరణ్యాలను అన్వేషించడాన్ని నేను చాలా ఆనందించాను . ఏప్రిల్ 22న థియేటర్ల‌లో ప్రదర్శితం కానుంది అని అన్నారు. ప్రియాంక చోప్రా ఇటీవల భ‌ర్త నిక్ జోనాస్ - కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి భారతదేశంలో ఉన్నారు.
ఇటీవల ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో బల్గారీ గ్రాండ్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌లలో ప్రియాంక చోప్రా ఒకరు. అనంత‌రం మార్చి 18న నిక్ ముంబై చేరుకున్నారు. ఈ ఏడాదిలో భారత్‌కు రావడం ఇది రెండోసారి. నిక్, అతడి సోదరులు కెవిన్ - జో జోనాస్ జనవరిలో లోల్లపలూజా ఇండియా మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చారు. తిరిగి అమెరికాకు వెళ్లే ముందు, ప్రియాంక -నిక్ జోనాస్ ముంబైలో త‌న‌ బంధువుల ఇంటిలో చోప్రా పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక‌లో ఈ అంద‌మైన జంట ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపించారు. దీనికి ముందు ప్రియాంక- నిక్ జోడీ నోయిడాలో మన్నారా ఆమె కుటుంబ సభ్యులు - స్నేహితులతో క‌లిసి హోలీ జరుపుకున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక `హెడ్స్ ఆఫ్ స్టేట్`లో జాన్ సెనా- ఇద్రిస్ ఎల్బాలతో కలిసి కనిపించనుంది. కత్రినా కైఫ్ - అలియా భట్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న‌ 'జీ లే జరా'లో కనిపించనుంది. అయితే రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.అయితే ఏప్రిల్ 22న థియేటర్ల‌లో వచ్చే టైగర్ సినిమాను సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి చూపించి ఎంజాయ్ చేయవచ్చు





Untitled Document
Advertisements