సాయి పల్లవి సినిమా సెలక్షన్ లో ఎలాంటి మార్పు ఉండదుగా!

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 03:05 PM

సాయి పల్లవి సినిమా సెలక్షన్ లో ఎలాంటి మార్పు ఉండదుగా!

తెలుగులో ఫిదా మూవీతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సాయి పల్లవి . ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కినది . ఆ సినిమా లో సాయి పల్లవి చేసిన యాక్షన్ కి అందరూ పిదా అయ్యారు. సాయి పల్లవి కూడా గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ తనకు ఇచ్చిన పాత్రలకు ప్రాణం పోస్తూ వస్తుంది. హీరో కంటే అతడికే అసలైన అగ్నిపరీక్ష నటిగా తనని తాను సినిమా సినిమాకు ఇంకాస్త మెరుగు పరచుకునే ప్రయత్నంలో సాయి పల్లవి తన మార్క్ చూపిస్తూ వస్తుంది. తన మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవడంలో ఈ అమ్మడు ది బెస్ట్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ ఉన్నా కూడా ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువ శాతం సాయి పల్లవి మీద ఉంది. ఆమె చేసే సినిమాలు ఎంచుకునే పాత్రలు ఆడియన్స్ ని సూపర్ సాటిస్ఫై చేస్తున్నాయి. కెరీర్ పరంగా ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తనయుడితో కలిసి ఒక మూవీ ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ లో కూడా సాయి పల్లవికి వరుస ఆఫర్లు వస్తున్నా కేవలం మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలే తప్ప వేరే వాటిని కాదనే కండీషన్ అక్కడ కూడా కొనసాగిస్తుంది. తనకు నచ్చిన కథ కోసం రెమ్యునరేషన్ లో కాస్త తక్కువైనా తీసుకునే సాయి పల్లవి నచ్చని కథ కోసం రెట్టింపు పారితోషికం ఇస్తానన్నా కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ లేదు. అందుకే హీరోయిన్స్ లో సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అనిపించేలా క్రేజ్ తెచ్చుకుంది.

సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లినా కూడా సాయి పల్లవి మాత్రం ఏమాత్రం మారదు మారలేదని అంటున్నారు. సాయి పల్లవి చేస్తున్న ఈ సినిమాల వల్ల ఆమె పాపులారిటీ రోజు రోజుకి డబుల్ అవుతున్నా కూడా సినిమాల సెలక్షన్ లో తను నెవర్ చేంజ్ అనిపించుకుంటుంది ఈ అమ్మడు. బాలీవుడ్ లో రామాయణం సినిమాలో కూడా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా చేస్తున్న రామాయణంలో సీతగా ప్రేక్షకులను తన నటనతో మేపిస్తుంది . ఈ విధంగా తనకు నచ్చని పాత్రలు ఏమైనా ఉంటే ఖచ్చితం చేయను చెప్పే ఈ అమ్మడు.. ఇప్పుడు తాను చేసే సినిమాలు ఎలా హిట్ అవుతాయో చూడాలి .






Untitled Document
Advertisements