విజయ్ తలపతి 70 వ సినిమా ఎవరితో ఉండనుంది?

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 03:21 PM

విజయ్ తలపతి 70 వ సినిమా ఎవరితో ఉండనుంది?

తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాలలో నటించిన విజయ్ తలపతి తన యాక్షన్ తో ప్రేక్షకుల మనస్సును మేప్పించాడు. ఇంకా కొద్దీ రోజులలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే నేప‌థ్యంలో ఈయన చివ‌రి సినిమా ఏది అవుతుంది? అన్న దానిపై కొన్ని రోజులుగా చర్చ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో కోలీవుడ్ స్టార్ మేక‌ర్స్ అంతా చివ‌రి సినిమా కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈయన ఆ ఛాన్స్ ఎవ‌రికి ఇస్తాడో అన్న విషయంపైన ఆలోచన అందరిది. తాజాగా ఆ స‌స్పెన్స్ కి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. విజ‌య్ చివ‌రి సినిమా ఏ ద‌ర్శ‌కుడితో అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే చిత్రం సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చివ‌రి సినిమా 'లియో-2' అవుతుందా? ఆ ఛాన్స్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కి ఇస్తాడా? కార్తీక్ సుబ్బ‌రాజ్ ని తెర‌పైకి తెస్తాడా? ఆర్జే బాలాజీని రంగంలోకి దించుతాడా , హెచ్. వినోద్ సీన్ లోకి తెస్తాడా, అని ఇలా ఈ నలుగురైదుగురి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర స‌న్నివేశమే క‌నిపించింది. అయితే ఇది విజ‌య్ కి 69వ సినిమా కావ‌డంతో రౌండ్ ఫిగ‌ర్ 70వ సినిమా కూడా పూర్తి చేస్తే ఇద్ద‌రికీ అవ‌కాశం ఇచ్చిన‌ట్లు గా ఉంటుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వస్తున్నాయి .

హీరో కంటే అతడికే అసలైన అగ్నిపరీక్ష కానీ విజ‌య్ పొలిటిక‌ల్ క‌మిట్ మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది , అంటే 69వ సినిమాతోనే న‌టుడిగా దూర‌మ‌వుతున్న‌ట్లు దాదాపు ఖ‌రారైపోయింది. ద‌ర్శ‌కుడిగా `ఖాకీ` ఫేం హెచ్. వినోధ్ ని దాదాపు ఫైనల్ చేసేసారు. ఇదో ప‌క్కా పొలిటికల్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల్లోనే పెను సంచ‌ల‌నం రేపే కంటెంట్ తో విజయ్-వినోద్ రంగంలోకి దిగుతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించే అవ‌కాశం తెలుగు నిర్మాత డి.వి.వి దాన‌య్య‌కి అప్ప‌గించారు. అంటే త‌మిళ్ తో పాటు తెలుగులోనూ ఈచిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది.

'రాజ‌కీయాలంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. త్యాగం..నా సీనియ‌ర్ల బాట‌లో నేను న‌డుస్తూ అందులో లోతుపాతులు తెలుసుకుంటాను. ఎప్ప‌టి నుంచో అందుకోసం మానసికంగా సిద్ద‌మ‌వుతున్నాను. పూర్తిస్థాయి రాజ‌కీయ నాయుకుడిగా మార‌డానికిముందు ఓ చిత్రంలో న‌టించాల‌నుకుంటున్నాను' అంటూ మ‌రో ప్ర‌క‌ట‌న రిలీజ్ చేయ‌డంతో విష‌యం అధికారిక‌మైంది. ప్ర‌స్తుతం విజ‌య్ ,వెంక‌ట్ ప్ర‌భు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చాల త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలి అని మేకర్స్ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది .చివరకు ఈయన 70 వ సినిమా చేస్తాడా లేదా అనే విషయమ తెలియడానికి ఇంకా సమయం పటేటట్లు తెలుస్తుంది .





Untitled Document
Advertisements