డిఫరెంట్ గా బ్రేక్‌ఫాస్ట్‌లో కి ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఇలా ట్రై చేయండి

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 09:58 AM

డిఫరెంట్  గా బ్రేక్‌ఫాస్ట్‌లో కి  ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఇలా ట్రై చేయండి

ఎప్పుడు ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ చేసి విసిగిపోతున్నారా , కొత్తగా డిఫరెంట్ ఎగ్ తో మరియు బ్రెడ్ తో ట్రై చేయండి .ఇది చాల టేస్ట్ గా ఉంటుంది . ఇది మీ పిల్లలజు బాగా నచ్చుతుంది . దీన్ని చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా చేయడం తెలుసుకుందాం.


ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు:

బ్రెడ్ ముక్కలు - రెండు
గుడ్లు - రెండు
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
బటర్ - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం :

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టండి.

గుడ్లను బాగా గిలక్కొట్టి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా చేయండి.

ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం వేసి బాగా కలపండి.

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాస్త బటర్ ను రాయండి.

ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో నానబెట్టండి.

తర్వాత తీసి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చండి. అంతే టేస్టీ ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయినట్టే.

దీని చేయడం కూడా చాలా సులువు. పిల్లలకి బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. రెండు గుడ్లు గిలక్కొట్టుకుంటే ఏడు నుంచి ఎనిమిది బ్రెడ్ స్లైసులతో టోస్ట్ రెడీ చేసుకోవచ్చు.మైదాతో చేసిన బ్రెడ్ ను వినియోగించడం మానేసి మల్టీ గ్రెయిన్ లేదా గోధుమ పిండితో చేసిన హోల్ వీట్ బ్రెడ్‌ను వినియోగించడం మంచిది. రొట్టె కాస్త గట్టిగా ఉంటే టోస్ట్ టేస్టీగా వస్తుంది. బ్రెడ్ మరీ మెత్తగా ఉందనుకుంటే ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లో ముక్కలను వేసి అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టండి. అది గట్టిగా అవుతాయి. అప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలో ఉంచితే అవి టేస్టీగా కాస్త గట్టిగా ఉంటే మంచిగా ఉంటాయి .పెరిగే పిల్లలకు డైలీ ఒక ఎగ్ పెట్టాలి. దీనిలో చాల రకాలైన ప్రోటీన్స్ , విటమిన్స్ ఉంటాయి . అయినా పిల్లలు డైలీ ఎగ్ తినలేరు. ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ తో చేయడం వలన వారు ఇష్టం గా తింటారు .






Untitled Document
Advertisements