తల స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 11:19 AM

తల స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అందరూ డైలీ స్నానం చేస్తారు అదే తలస్నానం (Hair wash) అయితే వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తారు.కొంతమంది
డైలీ హెడ్ బాత్ చేస్తారు ఎందుకంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడం వలన ,వారికీ దుమ్ము, దూళి, వంటివి తలపైన చేరడం వల్ల చేస్తారు . అయితే అసలు వారానికి ఎన్నిసార్లు హెయిర్ బాత్ చేయాలని ప్రశ్నిస్తే, అనేక రకాల సమాధానాలు వినిపిస్తాయి.
చాలా మంది తలస్నానం విషయంలో ఒక రొటీన్ షెడ్యూల్ ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు రకం, మాడు స్వభావాన్ని బట్టి ఎక్కువ సార్లు హెయిర్ బాత్ అవసరం కావచ్చు.

ముఖం, శరీరం మీద చర్మం లాగానే, స్కాల్ప్ కూడా ధూళి, చనిపోయిన చర్మ కణాలు, చెమటను ఆకర్షిస్తుంది. అందుకు రెగ్యులర్‌గా హెయిర్ బాత్ చేస్తే స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. జుట్టు రకాన్ని బట్టి ఎవరెవరు వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసుకోండి.


ఆయిలీ స్కాల్ప్:
కొంత మందికి ఆయిలీ స్కాల్ప్ (జిడ్డు మాడు) ఉన్నవారి నెత్తిపై నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీరు రోజూ తలస్నానం చేయవచ్చు. లేదంటే జుట్టు జిడ్డుగా మారి, మాడుపై మురికి పేరుకుపోతుంది. దీంతో చుండ్రు సమస్య రావచ్చు.అందువలన వీరు ఎక్కువగా హెడ్ బాత్ చేయవచ్చును .

సెన్సిటివ్ స్కాల్ప్:
కొంతమంది తల చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దీంతో మాడు, జుట్టు సున్నితంగా ఉంటుంది. అలాగే థిన్‌ హెయిర్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్‌లో ఎక్కువ నూనె గ్రంథులు ఉండి, జుట్టు త్వరగా ఆయిలీగా మారిపోతుంది. థిన్ హెయిర్‌కు నూనెలు త్వరగా అంటుకుంటాయి. దీంతో జుట్టు చిక్కుముడులు పడి, నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే పలుచటి జుట్టు ఉన్నవారు స్కాల్ప్‌పై సెబమ్ పేరుకుపోకుండా వారంలో రెండు, మూడు సార్లు తలస్నానం చేయవచ్చు. అయితే మరీ సెన్సిటివ్ హెయిర్, స్కాల్ప్ ఉంటే, వారానికి ఒకసారి హెయిర్ బాత్ సరిపోతుంది.

మందపాటి జుట్టు:
మందపాటి జుట్టు ఉన్నవారు రీ-మాయిశ్చరైజింగ్, స్మూథింగ్ వంటి లేబుల్స్ ఉన్న షాంపులను వాడటం మంచిది. వీరు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి తలస్నానం చేయవచ్చు. కాంబినేషన్ హెయిర్ అంటే ఒక మాదిరి మందం ఉన్న జుట్టు. వీరి కుదుళ్లు ఆయిలీగా ఉండి, చివర్లు పొడిగా ఉంటాయి. వీరు మాయిశ్చర్-బ్యాలెన్సింగ్ షాంపూ ఉపయోగించడం మంచిది. ఈ షాంపూలు జుట్టు మూలాలను శుభ్రం చేస్తూనే చివర్లకు తేమను అందిస్తాయి. మిడ్ థిక్ హెయిర్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకి ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది.

తల స్నానానికి జుట్టు రకానికి సరిపోయే షాంపూ వాడాలి. మరీ ఎక్కువ వేడి నీటితో హెయిర్ బాత్ చేయకూడదు. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడాలి. జుట్టుని టవల్‌తో బలంగా రుద్దకూడదు. తడి జుట్టును ఎలా పడితే అలా దువ్వకూడదు,అలా చేయడం వలన వెంట్రుకలు చిట్లిపోవచ్చు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన హెయిర్ కు కావలసిన ఆయిల్ , షాంపూ వాడడం మంచిది . ఈ మధ్య కాలంలో చాల రకాలైన షాంపూలు వస్తున్నాయి కానీ అన్నింటి కంటే కుంకుడు గాయాల రాసాన్నీ తీసుకొని హెడ్ బాత్ చేయడం చాల మంచిది.






Untitled Document
Advertisements