ఉగాది కానుకగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ దిల్ ఉన్న కథ

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 02:47 PM

ఉగాది కానుకగా  వస్తున్న ఫ్యామిలీ స్టార్ దిల్ ఉన్న కథ

దేవరకొండ పరశురాం వీరు ఇద్దరు కలిసి చేసిన సినిమా గీతా గోవిందం సూపర్ డూపర్ హిట్ కావడం తో మళ్లీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈసారి కొత్తగా ఫ్యామిలి ఎంటర్ టైన్మెంట్ గా ఫ్యామిలీ స్టార్ అంటూ వస్తున్నారు. గీతా గోవిందము సినిమాతో విజయ్ దేవరకొండకు
మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురం మరోసారి అలాంటి టార్గెట్ తోనే ఫ్యామిలీ స్టార్ తీశారు.ఏప్రిల్ 5 వ తేదీ శుక్రవారం ఉగాది సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా డైరెక్టర్ పరశురాం, హీరో దేవరకొండ ,హీరోయిన్స్ సినిమా ప్రమోషనల ఇంటర్వ్యూ ఇచ్చారు.



పరశురాం గీతా గోవిందం చెప్పినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ సినిమా కథ కూడా అలాంటి భావన తెచ్చింది. అని అన్నారు . ఆయన కథ చెబుతున్నప్పుడే నవ్వుకున్నా ప్రతి ఇంట్లో జరిగే కథలా ఫ్యామిలీ స్టార్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా సీన్స్ తన జీవితంలో జరిగాయని మిడిల్ క్లాస్ వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో అదే చూపించామని అన్నారు విజయ్ దేవరకొండ. తన ఫ్యామిలీ స్టార్ నాన్న గోవర్ధన్ అని ఆయన ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు. అందుకే కథ విన్నప్పుడే హీరో పేరు గోవర్ధన్ అని పెట్టమని డైరెక్టర్ కి చెప్పానని అన్నారు. తను బస్ లో వెళ్లేప్పుడు రోడ్డు మీద పెద్ద పెద్ద కార్లు చూసి వీళ్లకు డబ్బులు ఎలా వస్తున్నాయని అనుకునే వాడిని ఈ సినిమాలో తన పాత్ర తన రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. తన లైఫ్ లో జరిగిన చాలా విషయాలు సినిమాలో రిలేట్ అయ్యానని అన్నారు విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ స్టార్ క్రియేటర్ పరశురాం ఇది కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుందని అన్నారు. తన లైఫ్ లో ఫ్యామిలీ స్టార్ అమ్మేనని చెప్పిన పరశురాం తను గొప్ప వాడిని అవుతానని అమ్మ నమ్మిందని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో మృణాల్ కూడా తాను ఇప్పటివరకు ఇలాంటి జోనర్ సినిమాలో నటించలేదని. సినిమా రిలీజ్ అయ్యాక ఏవండి అనే పదం వైరల్ అవుతుందని అన్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సరిగ్గా 21 ఏళ్ల క్రితం దిల్ సినిమా రిలీజైన ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుండటం విశేషం. ఫ్యామిలీ స్టార్ ఒక దిల్ ఉన్న సినిమా కథ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. ఈ సినిమా దిల్ రాజుకి మరో దిల్ అయ్యేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ అండ్ టీం మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.మరి ప్రేక్షకులు మాత్రం ఎలాంటి హిట్ ఇస్తారో ఇంకా కొన్ని గంటలలో తెలిసిపోతుంది .





Untitled Document
Advertisements