టిల్లు స్క్వేర్ మూవీలో హీట్ అయిన రాధిక, లిల్లీ పాత్రలు

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 03:54 PM

 టిల్లు స్క్వేర్ మూవీలో హీట్ అయిన రాధిక,  లిల్లీ పాత్రలు

ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ టిల్లు స్క్వేర్. డిజ్ టిల్లు కు సికెవ్వల్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నడుస్తుంది . అయితే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి రాధిక పాత్రలో ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కూడా అదే స్థాయిలో నటించింది. లిల్లీ పాత్రలో మరో రాధిక అన్నట్లు భలే ఆకట్టుకుంది ప్రేక్షకులను .

ఏ సినిమాలు అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్‌ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్న అనుపమ పరమేశ్వరన్‌ త్వరలో జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్ కేరళ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లీగల్‌ థ్రిల్లర్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రను టిల్లు గాడి రాధిక చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా జానకి వర్సెస్ స్టేట్‌ ఆఫ్ కేరళ సినిమా యొక్క డబ్బింగ్‌ ను పూర్తి చేసినట్లుగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటన చేసింది. హీరోయిన్‌ గా ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. సురేష్‌ గోపి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ అమ్మడు మరో సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది . ఈ అమ్మడు చేసే నటనకి ఫ్యాన్స్ కూడా ఆలా కనెక్ట్ అవుతారు .





Untitled Document
Advertisements