పుష్ప 2 లో సమంత ఉంటుందా ?

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 04:10 PM

 పుష్ప 2 లో సమంత ఉంటుందా ?

సుకుమార్ 'పుష్ప: ది రూల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈసినిమా రెండున్నరేళ్ల క్రితం వచ్చిన 'పుష్ప: ది రైజ్' కు రెండో భాగం. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా పలువురు పాపులర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కనిపిస్తుందా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో ఉంది.

'పుష్ప 1' సమంత స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ తన డ్యాన్స్ లతో, ఇండియాను ఊపేసింది. ఒక విధంగా నార్త్ సర్క్యూట్స్ లో ఈ సినిమా విపరీతంగా ఆడేయడానికి పుష్పరాజ్ తో పాటుగా, సామ్ చేసిన ఐటెం సాంగ్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి. అందుకే ఇప్పుడు 'పుష్ప 2' చిత్రంలోనూ సమంత అప్పీరియన్స్ ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది . గతంలో సుకుమార్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటే ఈ మూవీలో సామ్ కనిపించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

బుచ్చిబాబు ఫిక్స్‌ 2018లో సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమాలో కూడా సమంత కనపడింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటించింది. ఇందులో ఆమె పోషించిన రామలక్ష్మి అనే విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చెర్రీ, సుక్కు, సామ్ ల కెరీర్ మలుపు తిరిగింది. అయితే నిజానికి ఈ సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా అనుకోలేదట. ఇదే విషయాన్ని దర్శకుడు ఓ ఇంటర్వూలో స్వయంగా వెల్లడించారు.

'రంగస్థలం' గురించి సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోలేదు, ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించానని తెలిపారు. సినిమాలో ఇద్దరూ పెద్ద స్టార్స్ ఉంటే సెట్ లో మ్యానేజ్ చేయలేనేమో అనిపించిందని, అందుకే రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ పల్లెటూరి అమ్మాయి పాత్రకు సామ్ బాగా సూట్ అవుతుందని చివరకు తననే ఫైనల్ చేసినట్లు తెలిపారు. అయితే ఇందులో ఆమె నటన చూసిన తర్వాత, తన ప్రతి సినిమాలోనూ సమంత ఉండేలా చూసుకుంటానని అన్నారు.

రామలక్ష్మిగా సామ్ నటన చూసి ఆశ్చర్యపోయానని ఆమె పలికించిన హావభావాలు అద్భుతమని సుకుమార్ కొనియాడారు. అంతేకాదు తాను సినిమాలు తీసినంతకాలం సమంతను హీరోయిన్ గా తీసుకుంటూనే ఉంటానని, 30 ఏళ్లు వస్తే ఆ వయసుకు తగ్గపాత్ర 40 వస్తే ఆ ఏజ్ కు తగ్గ పాత్ర రాసుకుంటానని అన్నారు. అన్నట్లుగానే 'పుష్ప' సినిమాలో ప్రత్యేక గీతంలో నటింపజేసారు. అదే మాటకు కట్టుబడి సుక్కు ఇప్పుడు 'పుష్ప 2' లోనూ ఆమెను భాగం చేస్తారేమో చూడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్' సినిమాని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ను మే నెలాఖురుకు పూర్తి చేసి జూన్ చివరి వరకు సాంగ్స్ తో సహా మొత్తం సినిమాని కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించలేదని టాక్ వినిపిస్తోంది. కాబట్టి దీంట్లో మళ్లీ సమంతను తీసుకొచ్చే ఆలోచన ఉందేమో అని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి .






Untitled Document
Advertisements