మగవారిలో బట్టనెత్తి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 10:40 AM

మగవారిలో  బట్టనెత్తి రాకుండా  ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

జుట్టు అనేది ఆడవారికి ,మగవారికి, ఇద్దరికి కావలసినది .సీజన్ మారేకొద్దీ జుట్టు సమస్య మారుతుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంది. శరీర ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేయడానికి చెమట పట్టడం ద్వారా బాడీ చల్లబడుతుంది. ఈ చెమట కారణంగా తలపై నూనె, మురికి అలాగే ఉండిపోతుంది. దీంతో పాటు జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు ఉంటాయి . దీని కారణంగా జుట్టు పల్చగా అవుతుంది. అంతేకాకుండా మగవారికి 35 సంవత్సరాల వయసులో జుట్టు రాలడం మొదలు అవుతుంది . ఇలా అవ్వడం వలన మగవారికి బట్టతల సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువలన హెయిర్ కేర్‌ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


సమ్మర్‌లో వచ్చే సమస్యల్ని దూరం చేయాలంటే రోజూ తలకి మసాజ్ చేయాలి. ఇది జుట్టుని బలంగా చేస్తుంది. రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. స్కాల్ప్ రంధ్రాలను కూడా తెరుస్తుంది. మురికి బయటకి పంపిస్తుంది.

మహిళల కంటే మగవారికి ఎక్కువగా వడదెబ్బ తగులుతుంది.ఎందుకంటే వీరు ఎక్కువగా బయట తిరగడం వలన సూర్యరశ్మి నేరుగా స్కాల్ప్‌కి గురైనప్పుడు అది పొడిగా, దురద, పొట్టకి కారణమవుతుంది. అలాగే, సూర్యరశ్మీ నేరుగా జుట్టు మీద పడడం వల్ల జుట్టుదెబ్బతింటుంది.మగవారు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తలని టోపీతో కప్పుకోవాలి. ఇది హానికరమైన సూర్యకిరణాల నుండి జుట్టుని రక్షిస్తుంది. చర్మానికి సన్‌స్క్రీన్ మాదిరిగానే జుట్టుకి కూడా సన్‌స్క్రీన్ ఉపయోగించొచ్చు.అంతేకాకుండా సూర్యరశ్మి నేరుగా తలపై పడడం వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. దీనిని ప్రోత్సహించడానికి, వేసవిలో, తేమ తలలో నూనె ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చుండ్రు కూడా పెరుగుతుంది.
మగవారు రోజూ తలస్నానం చేయొచ్చు. దీని వల్ల కాలుష్య కారకాలు వెంటనే తగ్గిపోతాయి. ఇది స్కాల్ప్ నుండి చెమట, నూనె, మురికిని కూడా తగ్గిస్తుంది. ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూలని వాడొద్దు. సల్ఫేట్ ఫ్రీ షాంపూలని వాడండి. సహజ పదార్థాలతో మాయిశ్చరైజింగ్ షాంపూలని ఉపయోగించండి. తలకి కండీషనర్ కూడా వాడాలి. అయితే, షాంపూ ఎక్కువగా వాడొద్దు.వీలైనంత వరకు జుట్టుకి నూనె రాయండి. జుట్టు రాలడం తగ్గించేందుకు రోజూ నూనె రాయండి. దీనివల్ల జుట్టు మెరుపు వస్తుంది.

మగవారు తలస్నానం చేసిన వెంటనే డ్రయ్యర్ వాడతారు. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడతారు. దీని వల్ల కూడా జుట్టు బలహీనమవుతుంది. వీటి బదులు జుట్టుని సహజంగానే ఆరనివ్వాలి. మగవారు బయట ఎక్కువగా తిరగడం వలన వాటర్ తక్కువగా తీసుకుంటారు దాని వలన ఎక్కువగా డీహైడ్రేుషన్ అవుతారు . అందుకోసం రోజూ 8 నుంచి 12 గ్లాసు నీరు తాగాలి.





Untitled Document
Advertisements