సూపర్ స్టార్ సరికొత్త సినిమా,.. రజనీ స్మ‌గ్ల‌ర్‌గా, డాన్ గా కనిపించనున్నట్లు సమాచారం

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 12:43 PM

సూపర్ స్టార్ సరికొత్త సినిమా,.. రజనీ స్మ‌గ్ల‌ర్‌గా, డాన్ గా  కనిపించనున్నట్లు సమాచారం

సూపర్ స్టార్ గా పేరు పొందిన ర‌జ‌నీకాంత్‌ టాలీవుడు లో ఎన్నో సినిమాలు చేసాడు కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం ఈయన ఒక కొత్త సినిమా తీసుతున్నట్లు సమాచారం వస్తుంది . ఈ సినిమాలో బంగారం స్మ‌గ్ల‌ర్.. గురించి ఉన్నట్లు తెలుస్తుంది కథ విషయానికి వస్తే ఇతను ఒక‌ బంగారం స్మ‌గ్ల‌ర్ కానీ ఓవ‌ర్ నైట్ లో అత‌డు బంగారాన్ని తీరాలు దాటించేయాలి దోచేయాల్సిందంతా దోచేయాలి. కానీ అత‌డు ఆ ప‌ని చేయ‌గ‌లిగాడా? లేదా? ఒక రాత్రి కోసం దొంగ‌త‌నాల‌పై ప్ర‌భుత్వ జీవోని ఎన్ క్యాష్ చేసుకున్నాడా? లేదా? అన్న ఇలాంటి ఒక వెరైటీ క‌థ‌తో లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా తీస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈసారి ర‌జ‌నీ కోసం ఒక స‌రికొత్త నేప‌థ్యాన్ని ఎంపిక చేసుకుని ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని స‌మాచారం.


రాజ‌మౌళి- శంక‌ర్‌లా క‌ఠినాత్ముడు కాడు ర‌జ‌నీ- లోకేష్ కనగరాజ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్ప‌టికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. టైటిల్ ని ఈ నెలలో ప్ర‌క‌టించాల్సి ఉండగా, అంత‌కుముందే క‌థంతా లీక్ అయిపోతోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ లియో చిత్రాన్ని హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించ‌గా, ఇప్పుడు ర‌జ‌నీ సినిమాని కూడా హాలీవుడ్ లో తెర‌కెక్కిన ఓ సినిమా స్ఫూర్తితో రూపొందిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రజనీ స్మ‌గ్ల‌ర్‌గా, డాన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

కొన్ని నెలల క్రితం తలైవర్ 171లో కింగ్ ఖాన్ షారుఖ్‌కు లోకేష్ కనగరాజ్ ఒక ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు పేర్కొన్నాయి. అయితే హిందీ ఖాన్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు క‌థ‌నాలొచ్చాయి.షారుఖ్‌ ఈ క‌ల‌యిక‌ను పాత్ర‌ను ఇష్టపడ్డారు. కానీ త‌న అభిమానులు పూర్తి స్థాయి పాత్రలలో మాత్రమే చూడాలని కోరుకోవడంతో ఆ పాత్రను తిరస్కరించాడు. ఆ త‌ర్వాత‌ ఈ ప్రత్యేక పాత్ర కోసం మరో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని ఖరారు చేశారు.

కోన్ని నెలలుగా రణ్‌వీర్ సింగ్ - లోకేష్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ర‌ణ‌వీర్ ఇంకా ఒప్పందంపై సంత‌కం చేయాల్సి ఉంద‌ని తెలిసింది. అయితే ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స్మ‌గ్ల‌ర్ గా, డాన్ గా, ఎస్కేపిస్టుగా న‌టిస్తున్నారు కాబ‌ట్టి, ర‌ణ‌వీర్ సింగ్ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తారో అన్న‌ విషయంపై ఊహాగానాలు సాగుతున్నాయి. అత‌డు క‌స్ట‌మ్స్ అధికారిగానో లేదా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారిగానో, ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గానో క‌నిపిస్తాడ‌ని ఊహిస్తున్నారు. ఒక‌వేళ ర‌ణ‌వీర్ సింగ్ యాడైతే హిందీ మార్కెట్‌లో తలైవర్171కి క‌లిసొచ్చే అంశం. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. జైల‌ర్ సినిమా ని త‌న‌దైన రీతిలో తీసి ఒక స్థాయిలో నిల‌బెట్టిన అనిరుధ్ కి ర‌జ‌నీతో వ‌ర‌సగా అవ‌కాశాలొస్తున్నాయి మరి ప్రస్తుతం వచ్చే ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి . రజని లాంటి గొప్ప హీరో చేసే సినిమా అంటే ఎవరికైనా చాల అంచనాలు ఉంటాయి .





Untitled Document
Advertisements