వరుస చిత్రాలతో జోరుమీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 05:11 PM

వరుస చిత్రాలతో జోరుమీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ

నందమూరి ఫ్యామిలీ అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది డైలాగ్స్ . నందమూరి వారసుడు అయినా నటసింహం బాలకృష్ణ. అటు రాజకీయాలలో ను ఇటు సినిమాలలోనూ ఎన్నడూ లేనంత ఉత్సాహంతో దూసుకుపోతున్నారు . అలాగే వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నారు. బాలయ్య ను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందనేది దర్శకులకి ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాస్ యాక్షన్ ప్యాక్డ్ కథలతోనే సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దీని తర్వాత తనకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాకి కథని సిద్ధం చేసుకునే పనిలో బోయపాటి ఉన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా అలా సినిమా చేయనున్నాడు. అయితే మూవీ స్టార్ట్ అయ్యేసరికి కొంత సమయం పట్టొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక పౌరాణిక చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందనేది తెలియదు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి బాలయ్య ఒప్పుకున్నట్లు తెలుస్తుంది .

వీరి కలయికలో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమాలు అన్ని బ్యాక్ టూ బ్యాక్ ఉండొచ్చని అనే టాక్ ఉంది . బాలయ్య లైన్ అప్ లో ఉన్న దర్శకులతో పర్ఫెక్ట్ మాస్ సినిమాలు పడితే 200 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా అందుకుంటారనే మాట వినిపిస్తోంది. నందమూరి అభిమానులు కూడా బాలయ్యను పాన్ ఇండియా స్టార్ గా చూడాలని ఆశ పడుతున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంది. అఖండ 2 చిత్రాన్ని బోయపాటి పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే అవకాశం ఉంది. బాలయ్య చేసే ఈ సినిమా ఏమైనా వరల్డ్ వైడ్ గా ఈయన ఇమేజ్ ని పెంచే అవకాషం ఉందొ చూడాలి .
ఏది ఏమైనా బాలయ్య అభిమానులు మాత్రము బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో ఆయన డైలాగ్ లతో ఎప్పుడు వస్తాడో అని ఎదురు చుస్తునారు .





Untitled Document
Advertisements