సాయిప‌ల్ల‌వికి బాలీవుడ్ లో పారితోషకం ఏన్ని కోట్లు ఇస్తున్నారంటే ?

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 02:35 PM

సాయిప‌ల్ల‌వికి  బాలీవుడ్ లో పారితోషకం  ఏన్ని కోట్లు ఇస్తున్నారంటే ?

చక్కనైన అందం ఎర్రని బుగ్గల మన తెలుగింటి అమ్మాయి అయినా హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. తనకున్నా ప్రతిభతో ఎలాంటి పాత్రనయినా ఎలా చేయగలదు అనే నేర్పరి. అందుకే ఎంత మంది కొత్త భామ‌లొచ్చినా టాలీవుడు లోకి ఆమెకి పోటీ కాద‌నే చెప్పాలి. నెంబ‌వ‌ర్ వ‌న్ రేసులో ఎంత‌మంది హీరోయిన్లు ఉన్నా! సాయి ప‌ల్ల‌వికంటూ ప్ర‌త్యేక‌మైన ట్రాక్ వేసుకుని ముందు కెళ్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది. కేవ‌లం డీసెంట్ పాత్ర‌ల మాత్ర‌మే చేస్తుంది. అందులోనూ న‌ట‌న‌కు ఆస్కారం ఉండాలి. ఇలా త‌న‌కంటూ కొన్ని నియ‌మ నిబంధ‌న‌లున్నాయి.

ఈ అమ్మడు వేసే ప్లాన్ వేరే లెవల్ ఆ ప్ర‌కారం ముందుకెళ్తుంది. అందుకు త‌గ్గ అవ‌కాశాలే అమ్మ‌డు అందుకుంటుంది. ఇక్క‌డ ఆమె ఒక్కో సినిమాని నాలుగు నుంచి ఐదు కోట్లు పారితోషికం అందుకుంటుంది. నిర్మాత‌ల్ని అధికంగా డిమాండ చేస్తోంద‌నిగానీ అద‌న‌పు భారాలు మోపుతుంద‌ని గానీ ఏ నాడు తెర‌పైకి వ‌చ్చింది లేదు. ఎందుకంటే అమ్మ‌డు ఇండ‌స్ట్రీలో కొన్ని ఎథిక్స్ తో ముందుకెళ్లుంది. ఎంతో డౌన్ ఎర్త్ ఉంటుంది. తాను హీరోయిన్ అనే ఫీల్ ని ప‌క్క‌న‌బెట్టి అంద‌రితో క‌లిసి పోయే మ‌న‌స్థ‌త్వం గ‌ల‌ది.

ఆ రక‌మైన ల‌క్ష‌ణం కూడా ప‌ల్ల‌విని తెలుగు ఆడియ‌న్స్ ని మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ లో 'రామాయ‌ణ్' లో న‌టిస్తోన్న సంగ‌తి అందరికి తెలిసిందే. ఇందులో సీత పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌రి ఈ సినిమాకి అమ్మ‌డు తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే అందరూ స్ట‌న్ అవ్వ‌డం ఖాయం. అవును అక్ష‌రాల 10 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందిట‌. ద‌క్షిణాది పారితోషికంతో పొల్చితే అక్క‌డ రెట్టింపు అందుకుంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి తాను డిమాండ్ చేయ‌కిపోతో హీరోయిన్ కి అంత ఎందుకు ఇస్తారు? అంటే ఇక్క‌డ త‌న మార్కెట్ వేల్యూ ని బాలీవుడ్ పెంచిన‌ట్లు స‌మాచారం తెలుస్తుంది ఇన్ని కోట్లు ఇవ్వండ‌ని ఎన్నడూ సాయిప‌ల్ల‌వి అడ‌గ‌లేదుట‌. తాను చేసే క్యారక్టర్ అందరికి నచ్చి ఇలా ఇస్తున్నారు అంటుంది ఈ అమ్మడు. ఈమె నటించే రామాయణ మూవీ ఏ దశకు చేరుకుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి .





Untitled Document
Advertisements