'బిగ్‌బాస్ 2' హౌస్ లోకి యాంకర్ ప్రదీప్..?

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 04:36 PM

'బిగ్‌బాస్ 2' హౌస్ లోకి యాంకర్ ప్రదీప్..?

హైదరాబాద్, జూలై 19 : 'బిగ్‌బాస్' మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో 'బిగ్‌బాస్' రెండో సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైన విషయం తెలిసిందే. ఈ సీజన్ 2పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పంద‌న వ‌స్తోంది. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ షో.. గురించే ఎక్కువ మంది చర్చిస్తున్నారు. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మరింత హైప్ పెంచుతూ ఇంటిసభ్యులను అలరిస్తున్నారు. ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎవరైనా ఇంట్లోకి వస్తారా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టీమ్ తాజాగా అందరికీ షాకిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టేశాడు. మంచి జోష్.. సమయస్ఫూర్తి కలిగిన ప్రదీప్.. తను చేస్తున్న బుల్లితెర షోలన్నింటిని ఆపివేసి బిగ్ బాస్ లోకి వచ్చాడా.? లేక నాలుగైదు రోజులు ఉండి పోతాడా అన్నది వేచి చూడాలి. అయితే బట్టలతో సహా బిగ్ బాస్ లోకి వచ్చిన ప్రదీప్ ను చూసి ఇంటిసభ్యులంతా షాక్ అయ్యారు. మరి ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోని వాతావరణం ఎలా మారుతుందో.. ఇంకెంత ఆసక్తికరంగా కొనసాగుతుందో చూడాలి మరి.

Untitled Document
Advertisements