చంద్రబాబు నిరుద్యోగ భృతి...పక్క రాష్ట్రాలకు ఆదర్శం!

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:40 AM

చంద్రబాబు నిరుద్యోగ భృతి...పక్క రాష్ట్రాలకు ఆదర్శం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో ప్రారంభమైన నిరుద్యోగ భృతిని పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగ భృతి అందించేందుకు సిద్ధమౌతోంది. గ్రాడ్యుయేషన్ లేదా దీనికి సమానవైన డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి రూ.3,500 అందించనుంది. ఇకపోతే మాజీ మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించడం లేదు. రాజస్థాన్ లో ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన పథకం కింద అర్హులైన వారికి నిరుద్యోగ భృతి అందనుంది. ఫిబ్రవరి నుంచి స్కీమ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాజస్థాన్‌కు చెందిన వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పథకం కింద మహిళా నిరుద్యోగులకు నెలకు రూ.3,500 లభిస్తుంది. అదే నిరుద్యోగులు మగవారు అయితే నెలకు రూ.3,000 ఇస్తారు. నిరుద్యోగ భృతి రెండేళ్ల వరకు ఇస్తారు.





Untitled Document
Advertisements