మోదీ సర్కార్ వినూత్నమైన పోటీ...గెలిచిన వారికి రూ.25,000!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 07:15 PM

మోదీ సర్కార్ వినూత్నమైన పోటీ...గెలిచిన వారికి రూ.25,000!

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. రూ.25,000 గెలుచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీని కోసం ఒక పోటీ నిర్వహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కోసం ప్రత్యేకమైన లోగోను డిజైన్ చేయాలని యోచిస్తోంది. దీని కోసం ప్రజల సాయం కోరుతోంది.


క్రియేటివ్‌గా మంచి డిజైన్‌తో లోగో వేసే వారికి నగదు ప్రోత్సాహం అందిస్తోంది. గెలుపొందిన వారికి రూ.25 వేలు అందిస్తుంది. MyGov.in పోర్టల్‌లో ఆత్మనిర్భర్ భారత్ లోగో డిజైన్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని గెలుపొందిన వారికి రూ.25 అందిస్తోంది.

పోటీలో పాల్గొనాలని భావించే వారికి గడువు తక్కువగానే ఉంది. ఆగస్ట్ 5లోపు పోటీదారులు ఎంట్రీస్‌ను సమర్పించాలి. అంటే లోగో వేసి ప్రభుత్వానికి పంపించాలి. మీరు వేసిన లోగోను మైగవర్నమెంట్ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి పంపాలి. పోటీలో నిలిచిన లోగో వేసిన వారికి రూ.25,000 అందజేస్తారు.

లోగో సమర్పించే వారు జేపీఈజీ లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో దాన్ని పంపాల్సి ఉంటుంది. సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో లోగోను ప్రదర్శించేలా ఉండాలి. లోగో వేసిన వారు ఆ లోగో అర్థాన్ని కూడా వివరించాల్సి ఉంటుంది. కేవలం భారతీయ పౌరులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.

Untitled Document
Advertisements