తలస్నానం తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 04:59 PM

తలస్నానం తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

రోజూ స్నానం చేస్తే నీట్ గా, క్లీన్ గా ఉంటాం అని చెబుతారు. అయితే, ఈ మధ్య కాలం లో పెద్దగా ఇల్లు వదిలి బయటకి వెళ్ళకుండా నాలుగు గోడల మధ్యనే కాలం గడుపుతున్న రోజుల్లో కూడా రోజూ స్నానం చేయవలసిన అవసరం ఏముందని కొంత మంది ప్రశ్న. ఇంట్లోనే ఉంటాం కాబట్టి నీట్ గా, క్లీన్ గా ఉంటాం, బయటకి వెళ్తే కదా దుమ్ము ఉండేది అనేది వారి వాదన. మరి కొంత మంది ఇంకా కాస్త ముందుకి వెళ్ళి వారానికి రెండు మూడు సార్లు స్నానం చేస్తే ఉండే బెనిఫిట్స్ గురించి కూడా చెబుతున్నారు. అయితే, రోజూ స్నానం చేయాలా వద్దా? అయితే నిపుణులు ఏమంటున్నారంటే స్నానం అనేది కేవలం దుమ్మునీ, డెడ్ స్కిన్ నీ రిమ్మువ్ చేయడం మాత్రమే కాదు, స్నానం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మజిల్ టెన్షన్ నుండి రిలీఫ్ వస్తుంది. ఫలితంగా కొన్ని డిసీజెస్ నుండి త్వరగా కోలుకోగలుగుతారు కూడా.

వర్క్ ఫ్రమ్ హోమ్‌లో రోజూ స్నానం చేయడం అనవసరం అని అనిపించడం సహజమే. ఇంట్లోనే ఉన్నప్పుడు డైలీ షవర్ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. కానీ, ఇంట్లోనే ఉన్నా కూడా బ్యాక్టీరియా ఎటాక్ నుండి ప్రొటెక్షన్ ఉండదు. రోజూ స్నానం వలన మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేయడానికి వీలుంటుంది. అయితే, కొన్ని రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారూ, మంచం పట్టిన వారూ రోజూ స్నానం చేయడం మంచిది కాదని చెబుతారు, కానీ వీరు కూడా వారికి కుదిరిన పద్ధతుల్లో క్లీన్ గా ఉండడం అవసరం, వారి చుట్టు పక్కల కూడా నీట్ గా ఉంచడం అవసరం.
డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు రెగ్యూలర్ స్కిన్ క్లీన్ చేస్తూ ఉండడం మంచిది కాదు, మరి వారు ఏం చేయాలి? వీరు స్నానం చేయగానే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఒక్కొక్కసారి నీటి తత్వం, వాడుతున్న సబ్బులు షాంపూల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అందుకని స్నానం తగ్గించడం కంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు నిపుణులు.
స్నానం అంటే స్కిన్ ని వాష్ చేయడం ఒక్కటే కాదు. స్కిన్ ని మృదువుగా రబ్ చేస్తేనే మురికీ, డెడ్ స్కిన్ పోతాయి. ఎలాంటి క్లెన్సింగ్ ఏజెంట్స్ ని వాడాలి అనే దాని మీద నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. మంచి క్వాలిటీ బాడీ ఆయిల్ కానీ, మాయిశ్చరైజర్ కానీ స్నానం చేసిన వెంటనే అప్లై చేయాలి.
స్నానం తరువాత వెంటనే వర్క్ చేయడానికి కూర్చోకుండా కనీసం ముప్ఫై నిమిషాలు యాక్టివ్ గా ఏదైనా పని చేయడం మంచిది.
వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకోవాలి.
చన్నీటి స్నానం అన్నింటికన్నా మంచిది కానీ ప్రస్తుతం చలికాలంలో గోరు వెచ్చని నీరు వాడడం మంచిది. మరీ వేడి నీటి స్నానం వల్ల స్కిన్ డ్రై గా అయిపోతుంది.





Untitled Document
Advertisements