మందకొడిగా స్టాక్ మార్కెట్లు..

     Written by : smtv Desk | Wed, Dec 20, 2017, 12:00 PM

మందకొడిగా స్టాక్ మార్కెట్లు..

ముంబై, డిసెంబర్ 20 : జాతీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల రికార్డుల్లో దూసుకెళ్లిన ట్రేడింగ్ ఈ రోజు కాస్తంత మందకొడిగా సాగాయి. లాభాలతోనే ఆరంభం మొదలైనప్పటికీ ఆ వెంటనే అమ్మకాల వెల్లువతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్ల నష్టంతో 33,795 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల మేర నష్టపోయి 10,449 వద్ద ఊగిసలాడుతున్నాయి. ఇదిలా ఉండగా హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటార్స్‌, టాటామోటార్స్‌ షేర్లు లాభాల్లో నడుస్తుండగా, టాటా స్టీల్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.





Untitled Document
Advertisements