షుగర్ వ్యాధిగ్రస్తులకు సిరి ధాన్యాలు ఏ విధంగా పనిచేస్తాయంటే..

     Written by : smtv Desk | Mon, Jul 01, 2024, 05:19 PM

షుగర్ వ్యాధిగ్రస్తులకు సిరి ధాన్యాలు ఏ విధంగా పనిచేస్తాయంటే..

స్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. నిజానికి షుగర్‌ వ్యాధిగ్రస్తులు పూర్తి ఆరోగ్యంగా కనిపించినా కూడా తినే తిండి తాగే నీరు ఇతర జీవన విధానం వల్ల ఒక్కసారిగా వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. షుగర్‌ ఒకసారి ఎటాక్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా లేకుండా చేసుకోవడం చాలా కష్టమైన పని. కానీ తినే తిండి మరియు జీవన విధానం సరిగా ఉంటే షుగర్ వచ్చి ముప్పై నలభై సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతికేయవచ్చు. రెగ్యులర్ గా షుగర్ ను కంట్రోల్‌ లో ఉంచే డైట్‌ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క షుగర్‌ పేషంట్‌ ఇన్సులిన్‌ ను తగ్గించి డైట్ ను ఫాలో అవుతూ షుగర్‌ ను కంట్రోల్‌ లో ఉంచుకోవాలి.
షుగర్‌ ను కంట్రోల్‌ లో ఉంచే వాటిలో ముఖ్యమైనవి సిరి ధాన్యాలు. ఈ మద్య కాలంలో అందరు కూడా సిరి ధాన్యాల యొక్క ప్రాముఖ్యత మరియు ఔషధ గుణాల గురించి చెబుతున్నారు. వెయ్యి రకాల అనారోగ్య సమస్యలకు సిరి ధాన్యాలు అద్భుతంగా పని చేస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఆయుర్వేద పండితులు ఒకరు ఇటీవల సిరి ధాన్యాలతో షుగర్‌ వ్యాధిగ్రస్తులపై ప్రయోగం నిర్వహించారట. దాదాపు ఆరు నెలల ప్రయోగాల తర్వాత సిరి ధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారు వెల్లడించారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులను తీసుకుని వారిలో కొందరికి రెండు నెలల వరకు, కొందరికి నాలుగు నెలల వరకు, కొందరికి ఆరు నెలల వరకు సిరి ధాన్యాలు ఇస్తూ వచ్చారు. ఆ సమయంలో షుగర్‌ లెవల్స్ నిలకడగా ఉంటూ వచ్చాయట.

ఎప్పుడైతే సిరి ధాన్యాలు తినడం మానేశారో అప్పుడు షుగర్ లెవెల్స్ లో తేడా వచ్చిందట. కనుక సిరి ధాన్యాలు వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు అయినా తినడం వల్ల అత్యంత ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సిరి దాన్యాల విషయంలో ఆయుర్వేద నిపుణులు చెప్పడం మాత్రమే కాకుండా ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఆ ప్రయోగ ఫలితాన్ని సమర్ధిస్తున్నారు. సిరి ధాన్యాలు షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడతాయి అంటూ నిరూపితం అయ్యింది. షుగర్‌ వ్యాధి లేని వారు కూడా వీటిని తీసుకోవడం మంచిది అని.. భవిష్యత్తులో షుగర్‌ వ్యాధి రాకుండా ఉంటుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. కనుక షుగర్‌ కు ఔషధంగానే కాకుండా షుగర్‌ లేని వారికి ముందస్తు జాగ్రత్తగా కూడా సిరి ధాన్యాలు ఉపయోగపడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సిరి ధాన్యాల విషయంలో శ్రద్ద చూపించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజు వారి ఆహారంలో సిరి ధాన్యాలను వాడటం వల్ల షుగర్‌ మాత్రమే కాకుండా మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.





Untitled Document
Advertisements