చేతులెత్తేసిన పూరి జగన్నాథ్??

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 12:56 PM

చేతులెత్తేసిన పూరి జగన్నాథ్??

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన "లైగర్" బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనుకుంటే, చివరికి బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. లైగర్ విడుదలకి ముందు తెగ హంగామా చేసిన కరణ్ జోహార్, "లైగర్" బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని తెలియగానే, అసలు ఈ సినిమాకి నాకు సంబంధం లేదు అన్నట్టు తెలివిగా పక్కకు తప్పుకున్నాడు. విజయ్ దేవరకొండ అయితే సినిమా గురించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడట్లేదు. చివరికి చేతులు కాల్చుకున్నది లైగర్ సినిమా నిర్మాతలు పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ. లైగర్ డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు జరిగిన నష్టాన్ని మీరే భర్తి చెయ్యాలి అని పూరి ఛార్మి ల వెనక పడ్డారంట. అయితే పూరి ఛార్మీ లు డిస్ట్రిబ్యూటర్ల జరిగిన నష్టాన్ని పూడుస్తారో లేదు అనేది ఇంకా తెలియదు. అయితే డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని భర్తీ చేస్తానని పూరి మాట ఇచ్చినట్టు కొన్ని రోజులు ముందు వార్తలు వినిపించాయి. కాని ఇప్పుడు పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్ల ముందు చేతులు ఎత్తేసాడంట. దీంతో డిస్ట్రిబ్యూటర్లకి కోపం వచ్చి వాళ్ళ డబ్బుల కోసం కోర్టును ఆశ్రయించనున్నారని తాజా సమాచారం.





Untitled Document
Advertisements