బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి రెప్పపాటులో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన బ్రాడ్

     Written by : smtv Desk | Sat, Jun 17, 2023, 04:36 PM

బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి రెప్పపాటులో కళ్లు చెదిరే క్యాచ్
 పట్టిన బ్రాడ్

క్రికెట్ ఆటలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఎవరు ఊహించలేరు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తాయి. తాజాగా ఇంగ్లండ్ లో టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ లో హ్యాంపషైర్ హ్యాక్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో సస్సెక్స్ ఆటగాడు బ్రాడ్ క్యూర్రీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో హ్యాంపషైర్ బ్యాటర్ బెన్నీ హోవెల్ షాట్ కొట్టి సిక్సర్ కు ప్రయత్నించాడు. అయితే డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రాడ్.. బంతి దిశగా పరుగెత్తి దానిని అద్భుతంగా పట్టుకున్నాడు. దీంతో సస్సెక్స్ విజయం సాధించింది. కళ్లు చెదిరే క్యాచ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు బ్రాడ్ క్యూర్రీ. అతనిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.





Untitled Document
Advertisements