అంబటి రాయుడు ప్లేస్ లో నిన్నే తీసుకుంటా.. ధోనీ

     Written by : smtv Desk | Tue, Jul 11, 2023, 12:50 PM

అంబటి రాయుడు ప్లేస్ లో నిన్నే తీసుకుంటా.. ధోనీ

మిసర్ట్ కూల్ గా పేరు సంపాదించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఫ్యాన్స్ అంతా ముద్దుగా మహీ అని పిలుచునే ఈ మిస్టర్ కూల్ తాజాగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ లో ఎల్ జీఎం సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) జట్టులోకి తనను తీసుకోవాలని ధోనిని అడిగారు. దీనికి ధోనీ ఇచ్చిన జవాబు ఫంక్షన్ లో నవ్వులు పూయించింది.

యోగి బాబుకు జవాబిస్తూ.. అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీఎస్ కే జట్టులో ఖాళీ ఉందని, ఆ ప్లేస్ లో తప్పకుండా నిన్నే తీసుకుంటామని ధోని చమత్కరించాడు. ఈ విషయంపై సీఎస్ కే మేనేజ్ మెంట్ తో మాట్లాడతానని సరదాగా హామీ ఇచ్చారు. అయితే, యోగి బాబు సినిమాలతో బిజీగా ఉన్నాడని గుర్తు చేస్తూ క్రికెట్ బాగా ఆడతావు కాబట్టి బౌలర్లు అందరూ నిన్నే టార్గెట్ చేస్తారని ధోనీ హెచ్చరించారు. నిన్ను గాయపరచడమే లక్ష్యంగా వేగంగా బంతులు విసురుతారని ధోని చెప్పడంతో యోగి బాబు సహా అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.





Untitled Document
Advertisements