బీసీసీఐనా మజాకా.. కళ్ళు చెదిరే ఆదాయం.. ఆదాయపు పన్ను కూడా అదే స్థాయిలో

     Written by : smtv Desk | Wed, Aug 09, 2023, 11:46 AM

 బీసీసీఐనా మజాకా.. కళ్ళు చెదిరే ఆదాయం.. ఆదాయపు పన్ను కూడా అదే స్థాయిలో

ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌ రూపంలో బీసీసీఐపై కోట్లకు కోట్లు లాభాలు ఆర్జిస్తుంది. వివిధ రూపాల్లో ప్రతీ ఏడాది బోర్డుకు వేల కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అంతే స్థాయిలో బోర్డు ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,159 కోట్ల పన్ను కట్టింది. అంతకుముందు ఏడాది కంటే అది 37 శాతం ఎక్కువ కావడం విశేషం. 2020–21లో రూ. 844.92 కోట్ల ఆదాయ పన్ను కట్టింది.

ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇక, 2021–22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ. 7,606 కోట్ల ఆదాయం లభించింది. అందులో 3,064 కోట్లను బోర్డు ఖర్చు చేసింది. 2020-21లో 4,735 కోట్ల ఆదాయం సమకూరగా అందులో 3,080 కోట్లు వివిధ పనుల కోసం ఖర్చయ్యాయి. కాగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్ల రూపాయలుగా ఉన్న బోర్డు ఆదాయపు పన్ను ఐదేళ్లలోనే రెట్టింపు కావడం విశేషం.





Untitled Document
Advertisements