మరోసారి నిరూపితమైన మహీ బాయ్ మంచి మనసు.. రథసారధికి దారి చూపిన అభిమాని

     Written by : smtv Desk | Sat, Aug 12, 2023, 10:54 AM

మరోసారి నిరూపితమైన మహీ బాయ్ మంచి మనసు.. రథసారధికి దారి చూపిన అభిమాని

భారత క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఆటకే కాదు అతని మృదువైన ప్రవర్తనకు, మంచి మనసుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. గొప్ప స్టార్ అయ్యుండి కూడా ఆయన అభిమానులతో సులువుగా కలిసిపోతుంటారు. గర్వం అన్నది మచ్చుకైనా కనిపించదు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారి అభిమానులను అలరిస్తోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ధోని తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరాడు. స్నేహితుడే కారు నడిపాడు. అయితే, మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్‌ను ధోని దారి ఎటని అడిగాడు. ‘‘అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది. దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది’’ అని అభిమాని చెప్పాడు. ‘‘అది విగ్రహం ఉన్న సర్కిలేనా?’’ అని ధోనీ మళ్లీ అడగ్గా అతడు అవునని చెప్పాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో ధోనీ సెల్ఫీ దిగి ముందుకెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.








Untitled Document
Advertisements