భారత్‌ కు ఊహించని షాకిచ్చిన వెస్టిండీస్​.. ఏడేళ్ల తర్వాత సిరీస్‌ సొంతం

     Written by : smtv Desk | Mon, Aug 14, 2023, 12:06 PM

భారత్‌ కు ఊహించని షాకిచ్చిన వెస్టిండీస్​..  ఏడేళ్ల తర్వాత  సిరీస్‌ సొంతం

ఎపుడు కాలం ఒకే విధంగా మనకు అనుకూలంగా ఉండదు. ఒక్కోసారి ఊహించని విధంగా పరిణామాలు మారిపోతు ఉంటాయి. తాజాగా భారత క్రికెట్ టీమ్ కు అటువంటి సంఘటన ఒకటి ఎదురైంది.
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత్‌ కు టీ20ల్లో మాత్రం షాక్ తగిలింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా 11 సిరీస్‌ విజయాలతో సాగుతున్న భారత జట్టు జోరుకు ఏడేళ్ల తర్వాత విండీస్ బ్రేక్‌ పడింది. నిన్నరాత్రి జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ పై నెగ్గింది. దీంతో సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. 2016 తర్వాత టీమిండియా ఓ సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ లో తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) అర్ధ శతకంతో రాణించాడు.
హైదరాబాదీ తిలక్ వర్మ (27) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్‌) దూకుడుగా ఆడటంతో విండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేసి సులువుగా గెలిచింది. నికోలస్ పూరన్‌ (35 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47) కూడా రాణించాడు. నాలుగు వికెట్లు తీసిన రొమారియో షెఫర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్‌ లో టాప్ స్కోరర్ అయిన నికోలస్ పూరన్‌ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డులు లభించాయి.





Untitled Document
Advertisements