మీరు సన్నగా ఉన్నారా? అయితే రోజు ఉదయం పెరుగుతో ఇలా చేయండి !

     Written by : smtv Desk | Thu, Feb 08, 2024, 07:50 AM

మీరు సన్నగా ఉన్నారా? అయితే రోజు ఉదయం పెరుగుతో ఇలా చేయండి !

మనం రోజు చూసే వ్యక్తులలో కొంతమంది అధిక బరువుతో సతమతం అవుతూ ఉంటె ఇంకొంతమంది ఎంత తిన్నా బరువు పెరగకుండా పీలగా స్కెలిటన్ లా ఉన్నాను అంటూ బాధపడుతూ ఉంటారు. నిజానికి మన వయసు, ఎత్తుకి తగిన బరువు లేకపోతే చూసేందుకు అందవికారంగా కనిపిస్తారు. అయితే బరువు ఎక్కువగా ఉంటె ఆరోగ్యసమస్యలు ఉన్నాయి అనే ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో, బరువు తక్కువగా ఉన్నా అదే ఫీలింగ్ కలుగుతుంది.

అందుకే సన్నగా ఉండే వారు బరువు పెరిగేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. మీరు గనుక ఆ సలహాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మనం సరైన బరువులో లేము అంటే సరిగ్గా తినకపోవడం ఒకటి అయితే వేళ కాని వేళల్లో తినడం మరొకటి. ఇలా సమయం అనేది లేకుండా ఇష్టానికి తినడం వలన బరువు పెరగక పోగా మరింతగా తగ్గే అవకాశం ఉంది. అందుకే సమయానికి ఆకలి అయ్యేలా..శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితనం మెరుగు పడేలా అల్లం మరియు శొంఠి వంటి పదార్థాలు ఉపయోగించాలి. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అలాగే మెటబాలిజం అద్భుతంగా పని చేస్తుంది. రాత్రి సమయంలో అన్నం లో వేడి చేసిన పాల ను గోరువెచ్చగా చేసి పోయాలి. అందులో కొద్దిగా పెరుగు తోడుగా వేయాలి. ఉదయానికి ఆ అన్నం కాస్త పెరుగన్నం గా మారుతుంది. అందులో అల్లం రసం మరియు శొంఠి లైట్ గా వేయడం ద్వారా ఈజీగా జీర్ణం అవుతుంది.

ప్రతి రోజు ఉదయం ఈ పెరుగన్నం తినడం వల్ల 30 నుండి 45 రోజుల్లో బరువు లో తేడా కనిపిస్తుంది. ఈజీగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బరువు పెరిగేందుకు డ్రై ఫ్రూట్స్ ను కూడా అధికంగా తీసుకోవాలి. రెగ్యులర్ గా వాటిని తినడం ఇబ్బంది అనిపిస్తే మనకు మార్కెట్ లో బాదం.. పిస్తా, జీడిపప్పు, దూలగొండి విత్తనాలు, జాపత్రి, అశ్వగంధ, నేల గుమ్మడి, పిల్లిపీచర వేళ్లు, సుగంధి పాలు సమపాళ్లలో కలిపి మిక్సీ చేయాలి.

మెత్తటి పొడిగా చేసి ఒక పొడి డబ్బాలో భద్రపరచుకుని ప్రతి రోజు కనీసం 200 నుండి 300 ఎంఎల్ పాలల్లో వేసుకుని తాగడం వల్ల నెల రోజుల్లోనే బరువులో మార్పు కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రతి రోజు కోడి గుడ్డు ను ఆహారం లోకి తీసుకోవడంతో పాటు పలు రకాల పండ్లు మరియు మాంసం ను కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండడం తో పాటు బరువు పెరుగుతారు. ప్రతి రోజు కూడా నాలుగు లేదా అయిదు సార్లు తింటూ ఉండాలి. జీర్ణ వ్యవస్థ లో ఎలాంటి మార్పులు రాకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన పదార్థాలు తింటే బరువు పెరగవచ్చు. పైన చెప్పిన విధంగా ఆహారం తీసుకునే విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటే చక్కగా మీ బరువు మెయింటైన అవుతుంది.





Untitled Document
Advertisements