కాసుల వర్షం కురిపిస్తున్న అంబానీ కంపెనీ!

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 12:31 PM

కాసుల వర్షం కురిపిస్తున్న అంబానీ కంపెనీ!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మంచి ఫలితాల్ని నమోదు చేసింది. జనవరి- మార్చి త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా తగ్గినా అంచనాల్ని మించింది. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.8 శాతం తగ్గి రూ. 18,951 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 11 శాతం పెరిగి రూ. 2,40,715 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ. 10 మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే సంస్థ నికర లాభం రూ. 1 లక్ష కోట్ల మార్క్ దాటేసింది. ఇక వార్షిక టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో తొలిసారిగా ఇలాంటి ఫలితాలు ప్రకటించింది.
రిలయన్స్ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 12 శాతానికిపైగా పెరిగింది. నెల వ్యవధిలో ఒక్క శాతం మాత్రమే పుంజుకుంది. 6 నెలల్లో ఏకంగా 30 శాతానికిపైగా ఎగబాకింది. ఇక ఏడాది కాలంలో చూసినట్లయితే 24 శాతం పెరిగిందీ స్టాక్. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 3024.90 కాగా.. కనిష్ట విలువ రూ. 2137.15 గా ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 19.78 లక్షల కోట్లుగా ఉంది.





Untitled Document
Advertisements