బరువు తగ్గాలి అనుకునేవారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 01:06 PM

బరువు తగ్గాలి అనుకునేవారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్

వేసవికాలంలో మనకు పుచ్చకాయలు అధికంగా లభిస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండు వేసవి తాపం నుండి విముక్తి లభించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుచికి మధురంగా ఉండి, అధిక నీటి శాతం కలిగిన ఈ పుచ్చకాయని తీసుకుంటే బరువు తగ్గుతారు. దీనిని తీసుకుంటే బాడీలో ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. దీంతో బాడీ డీటాక్స్ అయినట్లే. పుచ్చకాయని తీసుకుంటే బరువుని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

మొదటి 3 రోజులు..
రోజుకి మూడు పూటల వాటర్ మెలన్ తీసుకోవాలి. ఇతర సాలిడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. మధ్యమధ్యలో నీరు తాగొచ్చు.

తర్వాత 10 రోజులు..
బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు. ఓట్స్, చీజ్ ముక్కలతో లస్సీగా చేసి తీసుకోవచ్చు.
భోజనానికి ముందు 2, 3 పెద్ద పుచ్చకాయలని స్నాక్‌గా తినొచ్చు.
మధ్యాహ్నా భోజనంలో సలాడ్‌గా ఉడికించిన చికెన్‌ని తీసుకోవచ్చు. లేదా ఫిష్‌ తీసుకోవచ్చు.
డిన్నర్‌లో పుచ్చకాయని మాత్రమే తీసుకోవాలి.

* ఎక్కువకాలం ఈ డైట్ ఫాలో అవ్వడం కష్టం. అయితే, ఓ వారం వరకూ ట్రై చేయండి. ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.

బ్రేక్‌ఫాస్ట్‌లో హోల్‌గ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ 1, ఓ కప్పు పుచ్చకాయ
టీ టైమ్‌లో బ్లాక్ కాఫీ
లంచ్‌లో ఉడికించిన చికెన్, చేపలు, 1 హోల్ వీట్ బ్రెడ్, ఓ కప్పు పుచ్చకాయ
రాత్రి డిన్నర్‌లో.. 100 గ్రాముల ఉడికించిన కూరగాయలు, 100 గ్రాముల చికెన్ లేదా చేపలు, ఓ కప్పు పుచ్చకాయ

ఈ డైట్ గర్భిణీలు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు,ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, పిల్లలు ఫాలో అవ్వొద్దు.





Untitled Document
Advertisements