మాధవిలతపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 02:18 PM

మాధవిలతపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న పేరు మాధవీలత ఈమెకు ఇటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత తొలిసారి బరిలోకి దిగుతున్నారు. అయితే మాధవిలతపై సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన రేణు దేశాయ్.. మాధవీలతను ఆకాశానికెత్తారు. మాధవీలత ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్‌ని చూశానని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదని కూడా అన్నారు. మాధవీలత గురించి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నానని... ఆ విషయాన్నే చెప్పానని రేణు దేశాయ్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.
ఈ పోస్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంమైంది. ప్యాకేజీ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు తావిచ్చాయి. పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఆమె పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://www.instagram.com/p/C6LWwSsB6Zy/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==





Untitled Document
Advertisements