సొంతంగా వ్యాపారం చేస్తూ నెలకు 60 వేల వరకు సంపాదించే వ్యాపారాలు ఇవే!

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 09:41 AM

సొంతంగా వ్యాపారం చేస్తూ నెలకు 60 వేల వరకు సంపాదించే వ్యాపారాలు ఇవే!

ప్రస్తుత కాలంలో ఎక్కువగా యువత జాబ్స్ చేయడానికి ఇష్ట పడడం లేదు. ఎందుకంటే జాబ్స్ లో వచ్చే శాలరీ వారి ఖర్చులకు సరిపోవడం లేదు . అంతే కాకూండా జాబ్స్ అయితే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది శాలరీ తక్కువగా ఉంటుంది . ఒకవేళ ఇంక్రిమెంట్ మహా అయితే మూడు ,నాలుగు వేలు ఉంటుంది. అందుకే ఇప్పుడు యువత ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగాల కన్నా వ్యాపారాలు చాలా మేలు అంటున్నారు . అందులోనూ ఎక్కువగా ఫుడ్ లవర్స్ కి మంచి రుచి అందించే వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం ఫుడ్ బిజినెస్ లే లాభాలు తెస్తున్నాయి. ఫుడ్ లవర్స్ ఎక్కువ అవ్వడంతో ఎక్కడ టేస్టీ ఫుడ్ ఉంటే అక్కడికి వెళ్లి మరీ తింటున్నారు. దీంతో ప్రస్తుతం యువత అంతా ట్రెండింగా ఫుడ్ బిజినెస్ పై ఫోకస్ పెడుతున్నారు.

ఈ మాదిరిగా ఎన్నో చదువులు చదివిన వారు అంత ప్రైవేట్ ఉద్యోగం వదిలి బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు . అనేక మహానగరాల లో నగరవాసులకు తక్కువ ధరలలో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించేది ధ్యేయంగా పెట్టుకున్నారు . ప్రైవేట్ ఉద్యోగంలో వచ్చే జీతం సంతృప్తిగానే ఉన్నా వ్యాపారంలో రాణిస్తూ , మరో పది మంది యువకులకు ఉద్యోగం కల్పించాలనే ధ్యేయంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది అని తెలుస్తుంది. తక్కువ మొత్తంలో ఫుడ్ బిజినెస్ పెడితే తక్కువ ధరలో ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. 2లక్షల రూపాయలతో బిజినెస్ ప్లాన్ చేయడం చాల ఈజీ. ఇక్కడ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ కు సంబంధిచిన రుచికరమైన ఎగ్ రోల్ , చికెన్ రోల్ , చికెన్ పకోడీ , శాండ్విచ్ , వెజ్ మామోస్ , చికెన్ మామోస్ వంటి వాటికీ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు . ఎవరికైనా ఫుడ్ నచ్చితే చాలు అందరూ అక్కడికే వెళుతారు కావున ఫుడ్ లో మొదటగా టేస్టీ మరియు క్వాలిటీ చాల ముఖ్యం . ఈ రెండు మంచిగా ఉంటే లాభాలు వస్తాయి . అంతేకాకుండా మంచి ఫుడ్ కావాలంటే అక్కడికే వస్తారు . ఈ వ్యాపారంలో రోజుకి 2 వేల రూపాయలు ఆదాయం వచ్చినా నెలకు 60,000 రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు అని తెలుస్తుంది . ఈ విధంగా యువత తెలివితో కష్ట పడి ఎన్నో రకాలైన బిజినెస్ లు ఉన్నాయి . వాటిని చేసుకొని డబ్బులు సంపాదించడంతోపాటు పది మంది కి జాబ్స్ ఇస్తూ అందరికి మార్గదర్శంగా ఉండవచ్చును .





Untitled Document
Advertisements