లైలా సినిమాలో కొత్త గెటప్ లో కనిపిచనున్న విశ్వక్ సేన్

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 03:34 PM

లైలా సినిమాలో కొత్త గెటప్ లో కనిపిచనున్న విశ్వక్ సేన్

టాలీవుడ్ మంచి సెన్సషన్ క్రెటివిటీ పేరు తెచ్చుకున్నా హీరో విశ్వక్ సేన్. ఈయన చేసిన సినిమాలతో లో తన కంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మాస్ కా దాస్ గా పేరు పొంది ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే యంగ్ హీరోల్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే విశ్వక్ సేన్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రం గామితో మంచి హిట్ అందుకున్నారు.

ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమా లైలాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు అని తెలుస్తుంది . ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ నిన్ననే వచ్చింది. ఆ సమయంలో స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మేకప్ కిట్, అద్దం తదితర వస్తువులతోపాటు చివర్లో గన్‌ నుంచి బుల్లెట్‌ కు బదులు లిప్ స్టిక్ వస్తున్నట్టుగా మేకర్స్ చూపించారు. దీంతో అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటబ్బా అని నెటిజన్లు అంతా తెగ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆ మధ్య విశ్వక్ కూడా లైలా రోల్ తానే చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో లైలా రోల్ ను విశ్వక్ పోషించడం ఖరారైనట్లే. మేడమ్ మూవీలో రాజేంద్రప్రసాద్ లా ఫుల్ లెంగ్త్ లేడీ రోల్ లో విశ్వక్ సేన్ కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్టాఫ్ లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపిస్తారని, సెకండాఫ్ అంతా చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ కామెడీ జోనర్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. సెకండాఫ్ లో విశ్వక్ రగ్డ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఆకాంక్ష శర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తనిష్క్ బాగ్చి ఈ మూవీకి సంగీతం అందిస్తూ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు అని మేకర్స్. నుండి వార్తలు వేళ్లువడుతున్నాయి . దీన్ని బట్టి అనేక మంది హీరోలు గతంలో మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, మంచు మనోజ్, నరేష్, అల్లు అర్జున్ తోపాటు పలువురు లేడీ గెటప్స్ లో కనిపించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ తర్వాత లైలా సెట్స్ లో అడుగుపెట్టనున్నారు విశ్వక్. మరి వరుస సినిమా హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ కా దాస్ కు ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో, చూడాలి , ఈయన చేసే లేడీ గెటప్ ప్రేక్షకులను ఎలా ఆకర్శితాడో , ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో తెలియడానికి ఇంకా కాస్త టైం పట్టేట్లు ఉంది .





Untitled Document
Advertisements