ఫుడ్ డెలివ‌రీ కొరకు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై జోమాటో డెలివరీ ఏజెంట్‌ !

     Written by : smtv Desk | Thu, Apr 18, 2024, 11:45 AM

ఫుడ్ డెలివ‌రీ కొరకు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై  జోమాటో డెలివరీ ఏజెంట్‌ !

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకోరకం కొత్త ఈ కామర్స్ వ్యాపార వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ కామర్స్ ఫుడ్ డెలీవరీ యాప్ లైన జోమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ల డెలివరీ ఏజెంట్లు వివిధ కారణాల వల్ల ఇటీవ‌ల త‌రచుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇదే కోవ‌లో తాజాగా జోమాటో డెలివరీ ఏజెంట్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి ఖ‌రీదైన బైక్‌పై డెలివరీలు చేస్తుండ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. దీంతో ఈ డెలివ‌రీ బాయ్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

రూ. 2.4 లక్షలు విలువ చేసే హ్యార్లీ డేవిడ్‌సన్ ఎక్స్‌440 ప్రీమియం బైక్‌పై వీధుల్లో ప్రయాణిస్తూ ఫుడ్‌ డెలివరీలు చేస్తుండ‌డం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది. ఈ ఖ‌రీదైన బైక్‌పై రైడర్ అంతే కాస్ట్లీ హెల్మెట్, గ్లోవ్స్ ధరించి కనిపించాడు. ఇలా హై-ఎండ్ మోటార్ బైక్‌పై డెలివరీ ఏజెంట్ కూసింత వెరైటీగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఆహారాన్ని అందిస్తుండ‌డంతో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని విప‌రీతంగా ఆకర్షించి ట్రెడింగ్‌లో దూసుకెళ్లింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. కాగా, ఇది ఎక్క‌డ, ఎప్పుడు జ‌రిగింద‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. కానీ అంత ఖరీదైన బైక్ పై ఫుడ్ డెలివ‌రీ చేస్తున్న డెలివ‌రీ పార్టనర్ రిచ్ కావొచ్చు అని కూడా అనిపిస్తుంది కదా.


Untitled Document
Advertisements