ఆహాలోకి అభినవ్ గోమఠం 'మై డియర్ దొంగ' చిత్రం..

     Written by : smtv Desk | Thu, Apr 18, 2024, 12:25 PM

ఆహాలోకి  అభినవ్ గోమఠం 'మై డియర్ దొంగ' చిత్రం..

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోనా, చిన్న హీరోనా అనే తేడా లేకుండా కంటెంట్ నచ్చితే సినిమాని హిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.. ఇలాంటి నేపధ్యంలో అభినవ్ గోమఠం ఈ మధ్య కాలంలో తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఒక వైపున తాను ప్రధానమైన పాత్రగా కనిపించే సినిమాలు చేస్తూ, మరో వైపున హీరో ఫ్రెండ్స్ పాత్రలతో మెప్పిస్తూ .. ఇంకో వైపున వెబ్ సిరీస్ లతోను దూసుకుపోతున్నాడు. రీసెంటుగా వచ్చిన 'సేవ్ ద టైగర్స్' సిరీస్ విశేషమైన ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.

అలాంటి అభినవ్ ప్రధానమైన పాత్రధారిగా 'మై డియర్ దొంగ' సినిమా రూపొందింది. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చంద్ర - అభిలాష్ -మహేశ్ నిర్మించారు. ఈ సినిమా రేపు 'ఆహా' ద్వారా స్ట్రీమింగ్ కానుంది. టైటిల్ ను బట్టే ఇది కామెడీ టచ్ తో సాగుతుందనే విషయం అర్థమైపోతూనే ఉంది.
ఈ సినిమాలో కథానాయిక పాత్రలో కనిపించిన షాలినీయే కథను అందించడం విశేషం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. దొంగతనం కోసం ఒక అమ్మాయి ఇంటికి వెళ్లిన కథానాయకుడు, అక్కడ ఎలా చిక్కుబడిపోయాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏమేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

Untitled Document
Advertisements