తన రెండో పెళ్లి గురించి క్లారీటీ ఇచ్చిన మీనా

     Written by : smtv Desk | Thu, Apr 18, 2024, 12:52 PM

తన రెండో పెళ్లి గురించి క్లారీటీ ఇచ్చిన మీనా

గత కొంతకాలంగా సీనియర్ హీరోయిన్ మీనా రెండవ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు తరుచుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మీనా స్పందించారు. భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో కూరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నారు. భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నారు. కెరియర్‌పై మళ్లీ ఫోకస్ పెట్టిన మీనా.. కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలాకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిపై ఎప్పుడూ స్పందించని మీనా తాజాగా ఆ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తనను రెండోపెళ్లి వార్తలు మరింత బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. నటుడు ధనుష్‌తో తనకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని పేర్కొన్న మీనా.. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు. తనకో ఫ్యామిలీ వుందని, ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. మరి మీనా ఇచ్చిన ఈ క్లారీటీతో ఇప్పటికైనా ఆమె రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఆగిపోతాయో లేదో చూడాలి.

Untitled Document
Advertisements