ఇప్పుడు పవన్‌...త్వరలో మహేశ్‌

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 08:10 PM

ఇప్పుడు పవన్‌...త్వరలో మహేశ్‌

ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోయిన్లు.. స్టార్ హీరోలు అందరితో నటించాలని ఆశపడతారు. అయితే కొందరికి ఆ అవకాశం వెంటనే లభించగా.. మరికొందరికి మాత్రం ఎంతకాలం ఎదురుచూసినా లభించదు. ముఖ్యంగా స్టార్ హీరోలతో నటించాలంటే ఆ హీరోయిన్‌కి బోలెడంత అదృష్టం ఉండాలనే టాక్ కూడా ఉంది. చాలా మంది హీరోయిన్లు ఈ లక్‌తో కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలు అందరితో నటించే ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు ఈ లిస్టులో ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేరిపోయింది.

కెరీర్ ఆరంభంలో ఊహించినంత సక్సెస్ అందుకోలేకపోయింది నిధి. కానీ, పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి ఫేట్ మార్చేసింది. అయితే కెరీర్ ఆరంభం నుంచి ఈ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందీ ఈ భామ. అయితే పవర్‌స్టార్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో త్వరలో స్టెప్పులు వేయనుందట నిధి.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రాన్ని ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ తన స్టైల్‌లో ఇద్దరు హీరోయిన్లను ప్లాన్ చేస్తున్నాడట. ఫస్ట్ హీరోయిన్‌గా పూజా హెగ్డేని, సెకండ్ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని అనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఇదే జరిగితే తక్కవ గ్యాప్‌లోనే ఇద్దరు స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నిలిచే అవకాశం ఉంది.

అయితే దీంటో ఒక చిక్కు కూడా ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో మొదటి హీరోయిన్‌కి వచ్చినంత క్రేజ్ రెండో హీరోయిన్‌కి లభించదు. దీంతో ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున నిధి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేస్తే.. అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఒక వేళ పూజా హెగ్డే డేట్లు కుదరకపోతే.. ఆమెనే మెయిన్ హీరోయిన్‌గా పెట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నిధి మోస్ట్ లక్కీ హీరోయిన్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

Untitled Document
Advertisements