దితి ఎవరు?

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 03:50 PM

దితి ఎవరు?

దితి దక్షప్రజాపతి కుమార్తెలలో ఒకరు. కశ్యప ప్రజాపతి భార్య. ఈమెకు జన్మించిన వారే దైత్యులు (అసురులు). క్షీర సాగర మధనంలో దితి యొక్క సంతతిని ఇంద్రుడు సంహరించగా ఆమె తన భర్త కశ్యపుడ్ని ప్రార్థించి తనకు ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడు జన్మించేటట్లు వరం కోరగా 100 సంవత్సరాలు దీక్షతో దేవుడ్ని ప్రార్థిస్తే అలాంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. 100 సంవత్సరాలు కావొస్తుండగా ఇంద్రుడు విషయం తెలుసుకుని ఆమె నిద్రిస్తుండగా ఆమె గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలు చేస్తాడు. వారు అరవబోగా 'మారుద్ర' అని గట్టిగా అరచి ప్రతి ముక్కను మళ్ళీ 7 ముక్కలు చేయగా మొత్తం 49 ముక్కలై 'మారుత్సులను' దేవతలుగా ఆవిర్భవించి ఇంద్రుని సహాయకులవుతారు. కశ్యపుని ఇతర భార్యలకు సంతానం వుండి తనకు లేకపోవడంతో దైవభక్తిలో మునిగి ఉన్న సమయంలో సంధ్యా కాలంలో అతనితో సంగమం కోరుకుంది దితి. ఇప్పుడు సమయం కాదని చెప్పినా ఆమె వినకుండుటచే అయిష్టంగానే అతడు రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాని వల్ల బలాడ్యులైన ఇద్దరు పిల్లలు జన్మిస్తారు. వారు ముల్లోకాలను వణికిస్తారని మహావిష్ణువు వల్ల వధింపబడతారు అని చెప్తాడు. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. అయితే నీ మనుమడు విష్ణు భక్తుడు కాగలడు అని చెప్తాడు. అతడే ప్రహాల్లదుడు.





Untitled Document
Advertisements