ముంబైలో రూ. 1476 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు సీజ్ చేసిన అధికారులు

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 03:13 PM

ముంబైలో రూ. 1476 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు సీజ్ చేసిన అధికారులు

డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) శనివారం ముంబైలోని వాశికి దగ్గరలో నారింజపళ్ళు రవాణ చేస్తున్న ట్రక్ ని అడ్డుకుని 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్ (ఐస్) మరియు 9 కిలోల స్వచ్చమైన కొకెయిన్ ని సీజ్ చేసారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ. 1476 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. "ఇంపోర్టెడ్ నారింజపళ్ళు ఉన్న డబ్బాలలో మాదకద్రవ్యాలు దాచిపెట్టారు. పళ్ళను దిగుమతి చేసిన వ్యక్తిని పట్టుకుని విచారిస్తున్నాము", అని డీఆర్ఐ ముంబై తెలిపారు. ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.

Untitled Document
Advertisements