ఏకంగా 11 భాషల్లో విడుదల కాబోతున్న 'హనుమాన్' ..రిలీజ్ డేట్ ఫిక్స్

     Written by : smtv Desk | Mon, Jan 09, 2023, 03:52 PM

ఏకంగా 11 భాషల్లో విడుదల కాబోతున్న 'హనుమాన్' ..రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో తేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్ర౦ హనుమాన్ ఈ సినిమా డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకటుకునే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ మేరకు సినిమా విడుదలపై భారి అంచనాలు ఉన్నాయి.. అయితే ఈ సినిమా మే 12 న ఏకంగా 11 భాషల్లో పాన్ వరల్డ్ మూవీ గా విడుదల కబోతుంది.. అని మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు..
ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. చిత్రబృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్‌కు బావున్నాయంటూ ప్రశంసలు దక్కాయి. సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్‌ ఫేం వినయ్‌రాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలోనే ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్లు వచ్చాయని టాక్. తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇందులో కొరియన్‌, జపనీస్‌, ఇంగ్లీష్‌, స్పానీష్‌, చైనీస్‌ భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రిలీజవడం ఇదే తొలిసారి. ప్రయోగాత్మక సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వ‌ర్మ‌.. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండటంతో క్రేజ్ వచ్చింది. నిజానికి ప్రశాంత్‌ వర్మ ఒక్క టీజర్‌తోనే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచాడు. 'అ!' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్‌ వర్మ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'క‌ల్కి', 'జాంబిరెడ్డి' వంటి వరుస విభిన్న చిత్రాల‌తో ఇండస్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.





Untitled Document
Advertisements