ప్రపంచకప్ ఫైనల్‌ ఓటమితో ఏడ్చేసిన సిరాజ్.. ఓదార్చిన బుమ్రా

     Written by : smtv Desk | Mon, Nov 20, 2023, 11:29 AM

ప్రపంచకప్ ఫైనల్‌ ఓటమితో ఏడ్చేసిన సిరాజ్.. ఓదార్చిన బుమ్రా

నిన్న ఆదివారం నాడు జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వరస పెట్టి ప్రతి ఒక్క మ్యాచ్ గొ ఘనవిజయం సాదిస్తూ వచ్చిన భారత ఆటగాళ్ళు
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు. మ్యాచ్‌ను కోల్పోయిన వెంటనే సిరాజ్ నియంత్రించుకోలేకపోయాడు. కళ్లలోంచి అప్రయత్నంగానే నీళ్లు ఉబికి వచ్చాయి. గమనించిన బుమ్రా సహా ఇతర ఆటగాళ్లు అతడిని ఓదార్చారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుని ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.

Untitled Document
Advertisements