అనుపమ కోరిక నెరవేరిస్తే పెళ్లాడుతుందట!

     Written by : smtv Desk | Wed, Feb 28, 2024, 12:47 PM

అనుపమ కోరిక నెరవేరిస్తే పెళ్లాడుతుందట!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనుపమ. తన అందం, అభినయంతో యువహృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈగల్ సినిమాతో ఈ మధ్యే పలకరించిన అనుపమ.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నట్టుగా కనిపించడం లేదు. అనుపమ మాత్రం నెట్టింట్లో ఫుల్ బిజీగా ఉంటోంది. అనుపమ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు మారిషస్ వెళ్లి వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చెంది అవి ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

అనుపమ ప్రస్తుతం ఓ ఆఫర్ ఇచ్చింది. తన ఇన్ స్టా స్టోరీలో వీడియోను షేర్ చేసింది. అందులో బేబీ హిప్పోస్ కనిపిస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీకు సొంతం అవుతా అంటూ అనుపమ ఆఫర్ ఇచ్చింది. అంటే వాటిని గిఫ్టుగా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అని ఇలా హింట్ ఇచ్చేసింది.
అనుపమ అసలే క్రికెటర్ తో ప్రేమలో ఉందని ఆ మధ్య ప్రచారం సాగింది. ఇక టాలీవుడ్ హీరోతోనూ ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని తెలుస్తోంది. మరి అనుపమ తన పెళ్లి సంగతులు ఎప్పుడు బయటకు చెబుతుందో చూడాలి. కచ్చితంగా ప్రేమ వివాహామే చేసుకుంటానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫన్నీగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుపమ పెట్టిన ఈ పోస్ట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అందరిని ఆటపట్టిస్తున్న ఈ భామ వివాహం ఎన్నడో మరి.





Untitled Document
Advertisements